తెలంగాణ

డిసెంబర్‌కల్లా పెన్‌గంగ పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 24: డిసెంబర్ నాటికి పెన్‌గంగ ప్రాజెక్టును పూర్తి చేయడానికి ప్రయత్నిస్తామని నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. పెన్‌గంగపై వరుస బ్యారేజీలు నిర్మించేందుకు మహారాష్టత్రో ఒప్పందం కుదుర్చుకున్నట్టు చెప్పారు. 2018 జూన్ నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలనేది లక్ష్యమని, అయితే అంతకన్నా ముందుగానే ప్రాజెక్టు పూర్తి చేయాలని సభలో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన శాసన సభ్యులు కోరడంతో డిసెంబర్ నాటికి పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. మునుపటి ఆదిలాబాద్ జిల్లాలోని మధ్య తరహా, చిన్నతరహా సాగునీటి ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు చెప్పారు. మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టుల కింద 1,82,555 ఎకరాలు, చిన్నతరహా సాగునీటి ప్రాజెక్టుల కింద 3,14,809 ఎకరాల ఆయకట్టు విస్తీర్ణం ఉందని చెప్పారు. రాలివాగు ప్రాజెక్టు మొత్తం పూర్తయిందని, త్వరలో ప్రారంభించనున్నట్టు చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా 2420 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు లభిస్తుంది. మత్తడి వాగు ప్రాజెక్టు ద్వారా 8500 ఎకరాలకు సాగునీరు లభిస్తుంది. ఈ ప్రాజెక్టు కూడా పూర్తయింది. గాలివాగు ప్రాజెక్టు ద్వారా 9500 ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుందని, 96శాతం పనులు పూర్తయ్యాయని, జూన్ 2017 నాటికి పూర్తి చేయనున్నట్టు చెప్పారు. నిల్‌వాయి ప్రాజెక్టు ద్వారా 13వేల ఎకరాలకు సాగునీరు లభిస్తుందని, 11,500 ఎకరాలకు సాగునీరు అందించే విధంగా జూన్‌లో పనులు పూర్తవుతాయని చెప్పారు. కొమురం భీమ్ ప్రాజెక్టు ద్వారా 45,500 ఎకరాలకు సాగునీరు లభిస్తుందని, డిసెంబర్ 2017 నాటికి 11,500 ఎకరాలకు సాగునీరు అందించనున్నట్టు చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి మొత్తం ప్రాజెక్టులు పూర్తయి 93,920 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు లభిస్తుందని చెప్పారు.