తెలంగాణ

బిజెపి నేతల చలో అసెంబ్లీ ఉద్రిక్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 24: మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ ప్రస్తుత శాసనసభ సమావేశాల్లోనే బిల్లును తీసుకువస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడాన్ని నిరసిస్తూ బిజెపి యువమోర్చ శుక్రవారం నాడు నిర్వహించిన ఛలో అసెంబ్లీ ఉద్రిక్తతకు దారితీసింది. బిజెపి కార్యకర్తలు బృందాలుగా అసెంబ్లీ వైపు దూసుకువెళ్లడంతో పోలీసులు వారిని కట్టడి చేసి అదుపులోకి తీసుకున్నారు. ఒక బృందం అరెస్టు కాగానే, మరో బృందం అసెంబ్లీవైపు రావడంతో పోలీసులు ఉరుకులు పరుగులు తీశారు. చింతాసాంబమూర్తి నాయకత్వంలో ఒక బృందం లక్‌డికాపూల్ నుండి అసెంబ్లీ వైపు దూసుకురాగా, మరో బృందం పార్టీ ప్రధానకార్యదర్శి జి ప్రేమేందర్‌రెడ్డి నాయకత్వంలో మరో బృందం బషీర్‌బాగ్ వైపు నుండి వచ్చింది.
ఇంకో బృందం టి ఆచారి, జి మనోహర్‌రెడ్డిల నాయకత్వంలో నాంపల్లి వైపు నుండి రాగా, డాక్టర్ కె లక్ష్మణ్ నాయకత్వంలోని ఇంకో బృందం బషీర్‌బాగ్ నుండి వచ్చింది. రాజాసింగ్, ఎ ఆచారి, జి మనోహర్‌రెడ్డి తదితరులు నాంపల్లి నుండి , భరత్‌గౌడ్ తదితరులు మెడ్విన్ ఆస్పత్రి నుండి అసెంబ్లీ వైపు దూసుకువచ్చారు. బషీర్‌బాగ్ ఫ్లైఓవర్ వద్ద పోలీసులు బిజెపి నేతలను అడ్డుకుని వారిని అరెస్టు చేసి గోషామహల్ స్టేడియంకు తరలించారు. చింతల రామచంద్రారెడ్డి, ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్, జి కిషన్‌రెడ్డి, రాజాసింగ్ తదితరులతో పాటు వందలాది కార్యకర్తలను అరెస్టు చేశారు. ఎమ్మెల్యే ప్రభాకర్ ప్రతిఘటించడంతో అక్కడ ఉద్రిక్తతతో పాటు తోపులాట జరిగింది. ప్రభుత్వ ఆలోచనలను నిరసిస్తూ, మరో పక్క ఎబివిపి కార్యకర్తలు ఉస్మానియా యూనివర్శిటీలో భారీ ర్యాలీ నిర్వహించారు.
కోర్టుల మీద గౌరవం లేదా: లక్ష్మణ్
భూమి ఆకాశం ఏకమైనా ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించి తీరుతామని ముఖ్యమంత్రి ప్రకటించడం చూస్తుంటే రాజ్యాంగం మీద, కోర్టుల మీద గౌరవం లేనట్టు స్పష్టమవుతోందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పేర్కొన్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో ముస్లిం రిజర్వేషన్లపై కోర్టులు చాలా స్పష్టమైన తీర్పులు ఇచ్చినా, మత పరమైన రిజర్వేషన్లు చెల్లవని చెప్పినా ముఖ్యమంత్రి కెసిఆర్ అదే బాటలో పయనించడం ముస్లింలను మోసం చేయడం, బిసిలకు ద్రోహం చేయడమేనని అన్నారు. సిఎం ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పడం ఓట్లు పొందడానికి చేస్తున్న రాజకీయమేనని అన్నారు. ఓట్లు కోసం కాకుండా బిసిల బాగోగుల కోసం ముఖ్యమంత్రి పనిచేస్తే బావుండేదని చెప్పారు. రాజ్యాంగబద్ధం కాని ముస్లింల రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టడాన్ని నమ్మడానికి రాష్ట్రప్రజలు అమాయకులు కారని ముఖ్యమంత్రి తెలుసుకోవాలని అన్నారు.
అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు
కెసిఆర్ ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యలను నిరసిస్తూ ట్యాంక్ బండ్‌పైన ఉన్న డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించాలని పార్టీ నాయకులు నిర్ణయించారు.