తెలంగాణ

ఫలించిన పాతికేళ్ల నిరీక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, మార్చి 25: ఉత్తర తెలంగాణ జిల్లాల అభివృద్ధికి ఆయు వుపట్టులా నిలుస్తుందని ఆశిస్తున్న పెద్దపల్లి - నిజామాబాద్ రైల్వే లైన్ ప నులు పాతికేళ్లుగా కొన‘సాగు’తూ ఎట్టకేలకు పూర్తి కావడంతో ఈ మా ర్గంలో రైళ్ల రాకపోకలకు శ్రీకారం చుట్టారు. నిజామాబాద్ నుండి మో ర్తాడ్ మీదుగా కరీంనగర్ వరకు కొత్త గా ప్రవేశపెట్టిన డెము ప్యాసింజర్ రైలును శనివారం హైదరాబాద్ హైటె క్ సిటీలోని రైల్వే స్టేషన్ నుండి రిమో ట్ లింక్ ద్వారా రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు లాంఛనంగా ప్రారంభించగా, నిజామాబాద్ రైల్వే స్టేషన్‌లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పచ్చజెండా ఊపారు.
సుమారు వేయి కోట్ల రూపా యలను వెచ్చించి 178 కిలోమీటర్ల నిడివి కలిగిన ఈ రైల్వేలైన్ పనులను పూర్తి చేశారు. నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవితతో పా టు రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్, జహీరాబాద్ ఎంపి బిబి. పాటిల్, ఎమ్మెల్సీ ఆకుల లలిత, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ హైదరాబాద్‌లో రైల్వే మంత్రితో కలిసి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనగా, మంత్రి పోచా రం, ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, బిగాల గణేష్‌గుప్తా, జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు, మేయర్ ఆకుల సుజాత తదితరులు నిజామాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్రారంభోత్సవ సంరంభంలో భాగస్వాములై ఇదే రైలులో నిజామాబాద్ నుండి మోర్తాడ్ వరకు ప్రయాణించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఎనలేని సందడి నెలకొని, పండుగ వాతావరణం కనిపించింది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పో చారం మాట్లాడుతూ, పెద్దపల్లి - నిజామాబాద్ రైల్వే లైన్‌తో ఉత్తర తెలంగాణ ప్రాంతం మరింతగా అభివృద్ధి సాధిస్తుందని, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు విరివిగా ఏర్పాటవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 1976లోనే సర్వే జరిగినప్పటికీ, 1993లో పెద్దపల్లి - నిజామాబాద్ రైల్వేలైన్ పనులకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ఇది పూర్తయ్యేందుకు దాదాపు పాతిక సంవత్సరాల కాలం పట్టిందని, ఎట్టకేలకు రైళ్ల రాకపోకలు ప్రారంభం కావడం అన్ని వర్గాల వారి కి ఆనందం కలిగించిందన్నారు. ఎంపి కల్వకుంట్ల కవిత కేంద్రంపై ఒత్తిడి తెచ్చి మూడేళ్ల వ్యవధిలోనే సుమారు 350 కోట్ల రూపాయలను మంజూరు చేయించడంతో పనులు శరవేగంగా కొనసాగాయని, దశాబ్దాల కల సాకారమైందన్నారు. ఇదివరకటి కాంగ్రెస్ ఎంపిలు కూడా ఇదే తరహాలో చొరవ చూపి ఉంటే, ఇరవై సంవత్సరాల ముందే ఈ రైల్వేలైన్ అందుబాటులో కి వచ్చేదని మంత్రి పోచారం పేర్కొన్నారు. అప్పట్లో కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వమే అధికారంలో ఉన్నప్పటికీ, రైల్వే లైన్ కు అవసరమైన నిధులను మంజూరు చేయించడంలో గత ఎంపిలు వైఫ ల్యం చెందారని ఆరోపించారు. ప్రస్తు త ప్రధాని మోదీతో పాటు రైల్వే మంత్రి సురేష్‌ప్రభు విరివిగా నిధులు కేటాయించారని వారికి కృతజ్ఞతలు చెబుతూనే, నిధులు ఇచ్చింది కేంద్రమే అయినప్పటికీ, వాటిని తెచ్చింది మాత్రం ఎంపి కవిత అనే విషయాన్ని గుర్తించాలని మంత్రి పోచారం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు బ్రహ్మానందరెడ్డి, విజయ్‌భాస్కర్, నెడ్‌క్యాప్ చైర్మన్ ఎస్‌ఎ.అలీం, కలెక్టర్ డాక్టర్ యోగితారాణా, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణ, బిజెపి నాయకులు బద్దం లింగారెడ్డి, పల్లె గంగారెడ్డి, రైల్వే సలహా కమిటీ సభ్యులు మనోహర్‌రెడ్డి, పూదరి అరుణ తదితరులు పాల్గొన్నారు.