ఆంధ్రప్రదేశ్‌

కాంగ్రెస్ పాలనలోనే మోసాలకు బీజం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), మార్చి 25: ప్రస్తుతం రాష్ట్రంలో కలకలం రేపుతున్న అగ్రిగోల్డ్ మోసాలకు కాంగ్రెస్ పాలనలోనే బీజం పడిందని ఉప ముఖ్యమంత్రి, హోంశాఖామంత్రి ఎన్ చినరాజప్ప అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాకే అగ్రి మోసాలపై కేసులు నమోదు చేశామని, బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. నిందితుల ఆచూకీ తెలియచేస్తే పది లక్షలు నజరానా ఇస్తామని ప్రకటించారు. మంత్రి పత్తిపాటి పుల్లారావు కొనుగోలు చేసిన ఆస్తులకు, అగ్రిగోల్డ్ భూములకు సంబంధం లేదని అన్నారు. ఇక గౌతంరెడ్డి ఆస్తులతో సంబంధాన్ని సిఐడి తేలుస్తుందన్నారు. విజయవాడలోని డిజిపి క్యాంపు కార్యాలయంలో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ పదేళ్ల క్రితమే కాంగ్రెస్ పాలనలో అగ్రిగోల్డ్ మోసాలు ప్రారంభమయ్యాయని చెప్పారు. చాలామంది బాధితులు డిపాజిట్లు చెల్లించి మోసపోయారని, 700 కోట్ల రూపాయల విలువైన చెక్‌బౌన్స్‌లు అయ్యాయన్నారు. తెలుగుదేశం అధికారంలోకి రాగానే.. ఏలూరులో తొలి కేసు నమోదైందని, ఆతర్వాత పది కేసులు నమోదు చేసిన తమ ప్రభుత్వం సిఐడి విచారణకు అప్పగించామన్నారు. కాగా కొందరు బాధితులు నేరుగా హైకోర్టుకు వెళ్లడంతో న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా విచారణ చేపట్టి ఆస్తులు సీజ్ చేశామని వివరించారు.
మంత్రి పుల్లారావుకు సంబంధమేంటి?
అగ్రిగోల్డ్ ఆస్తులకు, మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆస్తులకు సంబంధమేముందని చినరాజప్ప ప్రశ్నించారు. గత అసెంబ్లీలోనే చర్చకు వచ్చినప్పుడు పుల్లారావుపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని తేలిందని, అయినా వాస్తవాలు వక్రీకరించేందుకు కొందరు ప్రయత్నిస్తూనే ఉన్నారని మండిపడ్డారు. సభలో ఒకలా.. బయట మరోలా వ్యవహరిస్తున్నారని, 16వేల ఎకరాలు, 82వేల చదరపు గజాల స్థలాలు జప్తు చేశామని, సిఐడి బాగా కృషి చేస్తోందని కితాబిచ్చారు. ఇంకా బాధితులు ఎవరున్నా ముందుకు రావాలని కోరారు. జప్పు చేసిన అగ్రిగోల్డ్ ఆస్తులకు, పుల్లారావు కొనుగోలు చేసిన ఆస్తులకు సంబంధం లేదని స్పష్టం చేశారు.
రూ. 10లక్షలు ఇస్తాం
ఇక అగ్రిగోల్డ్ కేసుల్లో నిందితులను వదిలే ప్రసక్తి లేదని మంత్రి స్పష్టం చేశారు. ఈ కేసుల్లో మిగిలిన వారిని వెంటనే అరెస్టు చేయాల్సిందిగా ఆదేశాలిచ్చామని, వారి ఆచూకీ ఎవరైనా చెబితే రూ.పది లక్షలు బహుమతి ఇస్తామని ప్రకటించారు. విలేఖరుల సమావేశంలో డిజిపి నండూరి సాంబశివరావు, సిఐడి అదనపు డిజి ద్వారకా తిరుమలరావు పాల్గొన్నారు.