ఆంధ్రప్రదేశ్‌

తెలుగు రాష్ట్రాలపై అమిత్‌షా దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 25: ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల్లో పాగా వేసిన బిజెపి తాజాగా దక్షిణాది రాష్ట్రాలు, ముఖ్యంగా రెండు తెలుగురాష్ట్రాలపై దృష్టి సారించనుంది. ఆ మేరకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రెండు దశల్లో ఇక్కడ పర్యటించనున్నట్లు సమాచారం. అందులో భాగంగా వచ్చే నెల తొలివారంలో మూడురోజుల పాటు హైదరాబాద్, చివరి వారంలో లేదా మే మొదటి వారంలో విజయవాడలో రెండురోజుల పాటు మకాం వేయాలని నిర్ణయించారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న విభిన్న రాజకీయ పరిస్థితులను ఇప్పటికే అధ్యయనం చేసిన అమిత్‌షా, ఆ మేరకు తమ పార్టీ నేతలను క్షేత్రస్థాయి కార్యక్రమాలకు సిద్ధం చేసే ప్రతిపాదనతో రానున్నారు. మొదటి నుంచి బూత్ కమిటీలపై సీరియస్‌గా దృష్టి సారిస్తున్న ఆయన, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దానిపైనే దృష్టి కేంద్రీకరించనున్నారు. బూత్ కమిటీలు పూర్తి చేసి, ఒక ఓటరులిస్టులో ఉండే 30 మందికి ఒకరిని ఇన్చార్జిగా నియమించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని భావిస్తున్నారు.
కాగా, రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెంచాలంటూ తెలుగుదేశం, తెరాస ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో వాటి అవసరాన్ని మరోసారి చర్చించనున్నారు. ఇటీవల ఢిల్లీలో కొందరు నాయకులు అమిత్‌షాను కలిసిన సందర్భంలో ఈ చర్చ వచ్చినట్లు సమాచారం. కేవలం వెంకయ్యనాయుడు, చంద్రబాబు, కేసీఆర్ అభిప్రాయాలే కాకుండా రెండు రాష్ట్రాల కమిటీ సమావేశాల్లోనూ, దీనిపై చర్చించే అవకాశం ఇవ్వాలని ఆయనకు సూచించినప్పుడు, అందుకు అమిత్‌షా అంగీకరించినట్లు తెలిసింది.
ఆ క్రమంలో ఆదివారం అనంతపురంలో జరిగే ఏపి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పునర్విభజన అవసరంపై చర్చించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. ఈ విషయంలో రాష్ట్ర అద్యక్షుడు హరిబాబు ఇష్టాఇష్టాలతో నిమిత్తం లేకుండా సమావేశంలో చర్చించాలని మెజారిటీ జిల్లా నేతలు ఒక నిర్ణయానికి వచ్చారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్ర కార్యవర్గ సమావేశ అజెండాను తమతో చర్చించకుండానే ఖరారు చేస్తున్నారన్న అసంతృప్తి చాలాకాలం నుంచి నెలకొంది. పునర్విభజనపై చర్చ జరగకుండా ఢిల్లీ స్థాయిలో వచ్చిన ఒత్తిళ్ల మేరకు అడ్డుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో, అజెండాలో లేకపోయినా పునర్విభజనపై చర్చించాల్సిందేనని మెజారిటీ నేతలు నిర్ణయించినట్లు తెలిసింది. సమావేశానికి కేంద్రమంత్రి నద్దా, సిద్దార్థనాధ్ కూడా హాజరుకానున్నారు. కాగా సిద్దార్థనాధ్ యుపి మంత్రిగా నియమితులు కావడంతో ఏపికి కొత్త ఇన్చార్జిని నియమించనున్నారు.