తెలంగాణ

సాగునీటి కోసం రాస్తారోకో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, మార్చి 24: కోయిల్‌సాగర్ ప్రాజెక్టు ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో రైతులు రోడ్డెక్కారు. హైదరాబాద్ - రాయిచూర్ వెళ్లే ప్రధాన రహదారిపై గంటల తరబడి మండుటెండల్లో రాస్తారోకోకు దిగి రహదారిని దిగ్బంధించారు. తమ పంటలను కాపాడాలంటూ వారు నినదించారు. రైతులు గత వారం రోజులుగా రహదారిని దిగ్బంధిస్తామని హెచ్చరించి అనుకున్నంత పనిచేశారు. ఉదయం పోలీసులకు రైతులు రోడ్డు పైకి వస్తున్నట్లు సమాచారం తెలియడంతో అప్రమత్తమైన జిల్లా అధికారులు కోయిల్‌సాగర్ ఆయకట్టు పరిధిలోని ఆయా గ్రామాల్లో పోలీసులు రంగప్రవేశం చేసి పికెట్‌ను ఏర్పాటు చేశారు. ప్రతి గ్రామంలో రైతులు ధర్నాకు రాకుండా అడ్డుకున్నారు. అయినప్పటికీ పంట పొలాలల్లో నుండి వచ్చిన రైతులు ఒక్కసారిగా హైదరాబాద్ - రాయిచూర్ వెళ్లే ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. తమ పంట పొలాలకు సాగునీరు వదిలే వరకు రహదారిపై నుండి లేచేది లేదని రైతులు భీష్మించారు. రైతులు చేపట్టిన ధర్నాకు టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యేలు దయాకర్‌రెడ్డి, సీతమ్మ, కాంగ్రెస్ దేవరకద్ర నియోజకవర్గ ఇన్‌చార్జి పవన్ కుమార్‌రెడ్డి హాజరై రైతులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దయాకర్‌రెడ్డి మాట్లాడుతూ కోయిల్‌సాగర్ ఆయకట్టు రైతులను ప్రభుత్వం విస్మరిస్తోందని, పంటలను కాపాడాలంటూ గత పదిహేను రోజుల నుండి రైతులు కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కోయిల్‌సాగర్ ప్రాజెక్టులో 12 ఫీట్ల నీటిమట్టం ఉందని, రెండు ఫీట్ల నీటిని మాత్రమే రైతులు అడగడం తప్పేమీకాదన్నారు. తాగునీటి అవసరాల కోసం మరో నాలుగైదు నెలల వరకు ఐదు ఫీట్ల నీరు సరిపోతాయని, మరో నాలుగు ఫీట్ల నీరు కోయిల్‌సాగర్ ప్రాజెక్టు నీరు నిల్వ ఉంటే దాంతో మత్స్యకారులకు ఉపాధి లభిస్తుందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ రైతు పక్షపాతి కాదని, ఆయన రైతు వ్యతిరేకి అని వారు ఆరోపించారు. ముఖ్యమంత్రికి నిజంగా రైతులపై అభిమానం ఉంటే తక్షణమే కోయిల్‌సాగర్ ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగునీటిని విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. దేవరకద్ర నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి పవన్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రైతుల ప్రభుత్వం కొనసాగడం లేదని, కుటుంబపాలన కొనసాగుతోందని, వారి కుటుంబం బాగుంటే అంతా బాగున్నట్లుగా కెసిఆర్ భావిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు సంపూర్ణ మద్దతు తెలుపుతుందని, వారితో కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి చేసేందుకు రైతులు చేపట్టే ఆందోళన కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతామని ఆయన స్పష్టం చేశారు. ఇదిలాఉండగా పోలీసులు మాత్రం కోయిల్‌సాగర్ ఆయకట్టు గ్రామాల్లో మాత్రం పోలీసులు బందోబస్తు చేపడుతుండడంతో ఎప్పుడు ఏమీ జరుగుతుందోనని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. కోయిల్‌సాగర్ ప్రాజెక్టు దగ్గర దాదాపు 150 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.