తెలంగాణ

జైళ్లశాఖ బంపర్ ఆఫర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 26: తెలంగాణ జైళ్లశాఖ బంపర్ ఆఫర్ ప్రకటించింది. జైళ్లలో కొందరు అధికారులు అవినీతి పాల్పడుతున్నారని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో జైళ్లశాఖ ఈ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. జైళ్లలో అవినీతిపరులపై ఫిర్యాదు చేసి, తగిన ఆధారాలతో నిరూపిస్తే రూ. 5,000లు బహుమతి ఇస్తామని, ఇది దేశంలోనే ప్రప్రథమమని తెలంగాణ జైళ్లశాఖ డైరెక్టర్ జనరల్ వికె సింగ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర జైళ్లశాఖ అవినీతి రహిత శాఖగా చూడాలన్నదే తమ ముఖ్యోద్దేశమని, అవినీతి అధికారులపై ఎవరైనా ఫిర్యాదు చేయదలిస్తే కంట్రోల్‌రూంలో రెండు టెలిఫోన్లు ఏర్పాటు చేయడం జరిగిందని, లక్ష వాల్ పోస్టర్లను ముద్రించి పంపిణీ చేశామని వికె సింగ్ తెలిపారు.