తెలంగాణ

ఎంపి సీతారాంనాయక్ కుమారుడి వివాహానికి హాజరైన సిఎం కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, మార్చి 24: మహబూబాబాద్ పార్లమెంటు సభ్యుడు సీతారాంనాయక్ కుమారుడి వివాహ వేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హాజరయ్యారు. గురువారం ఆయన ప్రత్యేక హెలికాప్టర్‌లో హైదరాబాద్ నుండి వరంగల్‌కు మధ్యాహ్నం 12:42 గంటలకు చెరుకున్నారు. ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర ఉపముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్‌అలీ, స్పీకర్ సిరికొండ మధుసూధనాచారి వెంట ఉన్నారు. హన్మకొండ ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద సిఎంకు ఘనస్వాగతం పలికారు. వారిలో మంత్రి అజ్మీర చందూలాల్, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దల పద్మ, ఎంపిలు కేశవరావు, పసునూరి దయాకర్, బాల్కసుమన్, బేబిపాటిల్, కొండా వీశే్వశ్వర్‌రెడ్డి, సంస్కృతిక సారధి చైర్మన్ రసమయి బాలకిషన్, జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ, సిటీ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు, మేయర్ నన్నపనేని నరేందర్, ఎమ్మెల్యేలు వినయ్‌భాస్కర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, కొండా సురేఖ, ఆరూరి రమేష్, ఎమ్మెల్సీ కొండా మురళి, జాయింట్ కలెక్టర్ ప్రశాంత్‌జీవన్‌పాటిల్, అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.
హెలిప్యాడ్ నుండి ముఖ్యమంత్రి నేరుగా హన్మకొండ విష్ణుప్రియ గార్డెన్‌లో ఎంపి సీతారాంనాయక్ కుమారుడి వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అక్కడి నుండి నేరుగా మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతారావు ఇంటికి వెళ్లారు. అక్కడ దాదాపు గంటన్నర సేపు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తిరిగి మధ్యాహ్నం 3:20 గంటలకు హెలిప్యాడ్‌లో హైదరాబాద్‌కు బయల్దేరారు.

చిత్రం ఎంపి సీతారాంనాయక్ కుమారుడి వివాహానికి హాజరైన సిఎం కెసిఆర్. చిత్రంలో ఉప ముఖ్యమంత్రులు కడియం, మహమూద్ అలీ తదితరులు