తెలంగాణ

బిసి అడ్వకేట్లకు సబ్సిడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 26: కొత్త రాష్ట్రం, కొత్త ప్రభుత్వం, అదే తరహాలో కొత్తపంథాలోనే బిసిల సంక్షేమం జరగాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మంత్రులకు, అధికారులకు ఉద్భోదించారు. ము ఖ్యమంత్రి సూచన మేరకు ఆ విధమైన చర్యలను రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ బడ్జెట్ రూపకల్పనలో కొత్తదనం చూపించారు. కొత్త పథకాలు, సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. 2017-18 వార్షిక బడ్జెట్‌లో బిసిల అభ్యున్నతి కోసం 5070.36 కోట్ల రూపాయలు కేటాయించారు. బిసి విద్యార్థులు ఉన్నత విద్య కోసం ‘మహాత్మా జ్యోతిపూలే బిసి విదేశీయాన విద్య నిధి’ని ప్రభుత్వం గత ఏడాది ప్రారంభించగా, ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో 20 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇది 300 మంది విద్యార్థులకు ఉపయోగపడుతుంది. దీంతో విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు అర్హులైన విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుంది. అదేవిధంగా బిసి అడ్వకేట్లకు సబ్సిడీని ప్రకటించింది. బిసి అడ్వకేట్లు తమ జీవన సరళిని మెరుగుపరచుకుని, న్యాయవాద వృత్తిలో స్థిరంగా పని చేసుకోవడానికి అవసరమైన శిక్షణకు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ సహాయం అందించేలా చర్యలు చేపట్టింది. ప్రతి జిల్లాలో ప్రతి ఏటా అర్హులైన 8 మందికి ఈ పథకం కింద ఎంపిక చేసి మూడేళ్ళ పాటు శిక్షణ అందిస్తుంది.
బిసిల్లో పెళ్ళికాని అమ్మాయిలకు వారి అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది. 2016-17లో కళ్యాణ లక్ష్మి పథకం కింద 51 వేల రూపాయలు ఆర్థిక సహాయంగా అందించగా, 2017-18లో 75,116 రూపాయలకు పెంచుతూ ప్రతిపాదించింది. కులాంతర వివాహాలు చేసుకునే వారిని ప్రోత్సహించాలని నిర్ణయించింది. కులాంతర వివాహం చేసుకున్న వారికి 10 వేల రూపాయల నగదుతో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేసేందుకు చర్యలు చేపట్టింది.