తెలంగాణ

జిరాక్స్ సెంటర్‌లో.. టెన్త్ హిందీ జవాబు పత్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తకోట, మార్చి 24: టెన్త్ హిందీ పరీక్షకు సంబంధించిన ప్రశ్నలను లీక్‌చేయడంతో ఆయా ప్రశ్నలకు జవాబుపత్రాలు గైడ్‌ల నుండి చించి ఒకపేపర్‌పై అంటించి జిరాక్స్‌లు తీస్తుండగా కొందరు పట్టుకుని జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. గురువారం మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోటలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ సందర్భంగా డిఇఓ విజయలక్ష్మిబాయి ఇక్కడ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ అందుకు సంబంధిత వివరాలు వెల్లడించారు. టెన్త్ హిందీ పరీక్ష నిర్వహిస్తుండగా మూడు ప్రశ్నలకు సమాధానాలను గైడ్‌లో చించి ఒక పేపర్‌గా తయారు చేస్తున్న భారతి జిరాక్స్ సెంటర్‌లో కొందరు పసిగట్టి జిల్లా అధికారులకు సమాచారం అందించారని ఆమె తెలిపారు. పరీక్ష పత్రం లీక్ కాలేదని, జవాబులు మాత్రం జిరాక్స్ తీస్తుండగా కొందరు పట్టుకున్నారన్నారు. వెంటనే అధికారులను ఆదేశించి పట్టణంలో నాలుగు సెంటర్లను తనిఖీ చేశారన్నారు. జవాబుపత్రాలు పరీక్ష కేంద్రాలకు అందలేదని ఆమె స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జిరాక్స్ సెంటర్ యజామానిపై కేసులు నమోదు చేయాలని ఆర్డీవో రాంచందర్, డిఎస్పీ చెన్నయ్యను ఆమె ఆదేశించారు. ఈ ప్రశ్నపత్రాలు ఎక్కడి నుండి బయటికి లీక్ అయ్యాయనే కోణంలో తనిఖీ చేస్తున్నామని, ఎక్కడా కూడా అన్ని పరీక్ష కేంద్రాలలో చీఫ్‌ల వద్ద సెల్‌ఫోనులు, డిపాజిట్ చేసి ఉంచారని, ఫోన్లుకూడా స్విచ్చ్ఫా ఉన్నాయని, అనంతరం ఫోన్లు ఆన్‌చేసి 9:30 నుండి 1గంట వరకు ఎవరెవరు బయటికి ఫోన్‌లు చేశారనే విషయం కూడా సమాచారాన్ని సేకరించామన్నారు. కానీ ఎక్కడా కూడా సెల్‌ఫోనులో వాడలేదనే విషయాన్ని అధికారులు గుర్తించినట్లు ఆమె తెలిపారు. పరీక్ష సమయంలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని, జిరాక్స్ సెంటర్లు కూడా ఉదయం 9గంటల నుండి మధ్యాహ్నం 1గంటల వరకు మూసి ఉంచాలనే నిబంధన ఉందని, లేనిచో అట్టి యజమానిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ తనిఖీల్లో గద్వాల డిప్యూటీ డిఇఓ నిరాజ్ అలీఖాన్, డిటి అసాం, ఎంఇఓ కురుమూర్తి, ఎస్సై కృష్ణ, తహశీల్దార్ రాజేందర్‌గౌడ్ తదితరులు ఉన్నారు.