తెలంగాణ

పెట్టుబడులకు స్వర్గ్ధామం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 24: పెట్టుబడులకు అవకాశం ఉన్న ప్రాంతంగా తెలంగాణను, రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను ప్రపంచవ్యాప్తంగా గుర్తిస్తున్నారని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విధానాలు, ప్రణాళికలు, కార్యాచరణ అందుకు అనుగుణంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో గురువారం సాయంత్రం ఫార్మాసిటీ, ఐటీ, టెక్స్‌టైల్ పార్క్, ఓఆర్‌ఆర్‌ల నిర్మాణం తదితర అంశాలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. హైదరాబాద్‌లో నెలకొల్పబోయే ఫార్మాసిటీలో పరిశ్రమలు నెలకొల్పేందుకు దేశవిదేశాలకు చెందిన కంపెనీలు ముందుకు వస్తున్నాయన్నారు. ఇతర దేశాలలో కామన్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల ఎలా పని చేస్తున్నాయో అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. సాలిడ్ వేస్ట్ మేనేజిమెంట్‌లో వస్తున్న కొత్త ధోరణులను పరిశీలించాలన్నారు. పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అనువైన వాతావరణం సృష్టించిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా అభినందించారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు బెంగళూరు, హైదరాబాద్ నగరాలే సరైనవని అందరూ గుర్తిస్తున్నారని ముఖ్యమంత్రి అన్నారు. ఇటీవల చెన్నైలో సంభవించిన పెను తుఫాను ప్రభారం వల్ల అక్కడి నుంచి కొన్ని కంపెనీలు వెనక్కి మళ్లుతున్నాయని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ నగరంపై ఉన్న అంచనాలు నిలబెట్టుకోవడానికి ప్రభుత్వం తరఫున తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి చెప్పారు. హైదరాబాద్‌లో జినోం వ్యాలీలో వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, టి-హబ్ కూడా మంచి ఫలితాలను ఇచ్చిందన్నారు. ప్రపంచంలోని చాలా కంపెనీలు హైదరాబాద్‌లో బ్యాకాఫీసును ఏర్పాటు చేసుకుంటున్నాయన్నారు. పరిశ్రమలు, ఫార్మాసిటీ, ఐటీ కంపెనీలు, టెక్స్‌టైల్ పార్క్ తదితర కల్పన కార్యకలాపాల వల్ల ట్రాఫిక్ రద్దీ పెరిగి, దీని ప్రభావం హైదరాబాద్ నగరంలో రవాణా వ్యవస్థపై ఉండబోతోందదన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని మెరుగైన రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఆరు నెలల కాలంలోనే తాము పరిశ్రమ స్థాపించి ఉత్పత్తి ప్రారంభించగలిగినట్టు మైక్రోమ్యాక్స్ కంపెనీ యాజమాన్యం ఇటీవల రాసిన లేఖను ఐటీశాఖ మంత్రి కెటిఆర్ ముఖ్యమంత్రికి చూపించారు. ఉత్తరాఖండ్‌లో ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడానికి రెండున్నర ఏళ్లు పడితే, తెలంగాణలో కేవలం ఆరు నెలల్లో పూర్తి అయిందని మైక్రోమ్యాక్స్ పేర్కొన్నట్టు మంత్రి చెప్పారు.