తెలంగాణ

అడ్డగోలుగా మందుల కొనుగోళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 27: వైద్య పరికరాల కొనుగోలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక విధానాన్ని రూపొందించుకోలేదని కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ (కాగ్) తప్పుపట్టింది. 2014-16 సంవత్సరాల మధ్య కాలంలో 87.32 కోట్ల విలువైన పరికరాల కొనుగోళ్ళను పరిశీలిస్తే ప్రభుత్వం పెద్ద మొత్తంలో నష్టపోయిందని ‘కాగ్’ పేర్కొంది. క్షేత్ర స్థాయిలో వైద్యశాలల అవసరాలకు అనువుగా ఆయా శాఖాధిపతులు వైద్య పరికరాల కొనుగోలు కోసం ఒక ప్రక్రియను అనుసరించకపోవటం దురదృష్టమని పేర్కొంది. ఇండెంట్ ప్రక్రియ, సాంకేతికమైన ఎంపిక (ఆప్షన్లు), పరికరాల ప్రత్యేకతలను నిర్దేశించడం, పరికరాల అమరిక, వాటి నిర్వహణ వంటి విషయాల్లో పలు లోటుపాట్లు ఉన్నట్లు కాగ్ గుర్తించింది. వైద్య పరికరాల కోసం కొనుగోలు విధానం రూపొందిస్తామని నిరుడు ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ 2015 సంవత్సరం సెప్టెంబర్‌లో 50 వెంటిలేటర్లకు (బెల్లవిస్టా 1000) ఇండెంట్ చేశారు. వీటిని స్వైన్‌ఫ్లూ తదితర కేసుల్లో ఉపయోగిస్తారు. బిడ్ ఫైనలైజేషన్ కమిటీ 2015 నవంబర్‌లో ఆమోదించిన మీదట కార్పొరేషన్ ఈ ఇండెంట్‌ను ఖరారు చేసింది. మెస్స్‌ర్స్ సీజన్స్ హెల్త్ కేర్ లిమిటెడ్ అనే సంస్ధ ప్రతిపాదించిన 11.01 లక్షల యూనిట్ రేటుకు సమ్మతించి, 50 వెంటిలేటర్లను 2016 ఫిబ్రవరిలో ఆ సంస్థ నుంచి కొనుగోలు చేసింది. ఇందుకు సంబంధించిన టెండరు పత్రాలను పరిశీలించగా, ప్రభుత్వ శాఖ గతంలోని టెండర్ల ప్రకారం ఈ పరికరం మార్కెట్ రేట్‌ను 6.50 లక్షలుగా నిర్థారించినట్లు తెలిసింది. కాగా ప్రభుత్వ శాఖ తన టెండరు డాక్యుమెంటులో ఈ రేటును తీసుకోలేదు. అంతేకాకుండా మెస్సర్స్ షిల్లర్ అనే సంస్థ ఇదే బెల్లవస్తా 1000 వెంటిలేటర్ పరికరాన్ని చెన్నైలోని మెస్సర్స్ అస్ట్రో ఆర్థో అండ్ స్వైన్ ఆసుపత్రికి 2015 సంవత్సరం మేలో 8.50 లక్షలకు సరఫరా చేసింది. అధిక ధర చెల్లించిన అంశాన్ని ఆడిట్‌లో ప్రస్తావించగా, ఈ బిడ్డర్ అమ్మిన బెల్లవిస్టా 1000 పరికరం సమగ్రాకృతి కలిగినదనీ, పరికరాల రేట్లు వాటిలోని ప్రత్యేకతలకు తగినట్లు మారుతుంటాయని 2016 జూన్‌లో కార్పొరేషన్ సమాధానమిచ్చింది. యూనిట్ ధరగా చెల్లించిన 11.01 లక్షలకు తగినంతగా ఈ పరికరంలో ఉన్న విశిష్టతలు ఏమిటో ప్రభుత్వం పేర్కొనలేదు.