తెలంగాణ

కాళేశ్వరం చుట్టూ నీటి ఆశలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 24:దాదాపు పుష్కర కాలం నుంచి తెలంగాణలో భారీ నీటిపారుదల ప్రాజెక్టులపై ఆశలు రేకెత్తిస్తున్నారు. గడువు తీరుతోంది. ఎన్నికలు వస్తున్నాయి పాలకులు మారుతున్నారు. పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. అయితే తెలంగాణ ఆవిర్భవించిన తరువాత భారీనీటిపారుదల ప్రాజెక్టులపై ప్రజల్లో మరోసారి ఆశలు చిగురించాయి. అయితే అదే సమయంలో పలు అనుమానాలూ తలెత్తాయి. ప్రతి రాష్ట్రంలో కేంద్రం ఒక జాతీయ ప్రాజెక్టు చేపడతున్నట్టుగానే తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా చేపట్టే అవకాశం ఉంది. దీని కోసమే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి మహారాష్టత్రో ఒప్పందాలకు ప్రాధాన్యత ఇచ్చింది. మహారాష్టత్రో ఒప్పందాలు కుదిరి అవసరం అయిన అనుమతులు అన్నీ వచ్చిన తరువాతనే జాతీయ ప్రాజెక్టు హోదా లభించడానికి మార్గం సుగమం అవుతుంది. దీని కోసమే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్వయంగా మహారాష్టక్రు రెండుసార్లు వెళ్లి ప్రభుత్వంతో చర్చించారు. ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చినా ఏప్రిల్ మొదటి వారంలో అధికారికంగా ఇరువురు ముఖ్యమంత్రుల మధ్య తుది ఒప్పందం కుదురుతుంది. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఆంధ్రప్రదేశ్‌లో పొలవరంకు జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించారు. అదే విధంగా తెలంగాణలో ఒక ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి కేంద్రమే నిధులు ఇస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకే జాతీయ హోదా కోసం ప్రభుత్వం ఆసక్తి చూపిస్తోంది. ఈ అంశంపై ఉమాభారతిని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, ఇంజనీర్ల బృందం గతంలో కలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తిస్తే, సగం భారం తీరిపోతుందని, మిగిలిన ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం నిధులతో నిర్మించవచ్చుననే ఆలోచనలో ఉన్నారు.
ఆశలు కల్పించిన బాబు
2004 ఎన్నికలకు ముందు నుంచే తెలంగాణలోని భారీ నీటిపారుదల ప్రాజెక్టులపై ఆశలు రేకెత్తించడం ప్రారంభం అయింది. ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్న చంద్రబాబునాయుడు తెలంగాణలో మారుతున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఎన్నికలకు వెళ్లడానికి ముందు హడావుడిగా దేవాదులకు శ్రీకారం చుట్టారు. చివరకు పురోహితులు సైతం వెళ్లలేని పరిస్థితుల్లో వారిని సైతం హెలికాప్టర్‌లోనే తీసుకుని వెళ్లి భూమి పూజ చేశారు. అంతకు మించి దేవాదుల ప్రాజెక్టులో ఎలాంటి పురోగతి బాబు హయాంలో జరగలేదు. ఆ తరువాత ఎన్నికలు వచ్చి టిడిపి ఘోరంగా ఓడిపోయింది. వైఎస్‌ఆర్ అధికారంలోకి వచ్చిన తరువాత భారీ ఎత్తున జల యజ్ఞం చేపట్టారు. మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు, అవినీతి, అక్రమాలు అంటూ ప్రచారం జరిగింది. నిధుల కేటాయింపు, వ్యయం భారీగా జరిగిన అనుకున్న విధంగా తెలంగాణలో ప్రాజెక్టులు మాత్రం పూర్తి కాలేదు. తెలంగాణ రైతుల ఆశలు నెరవేరలేదు.
తెలంగాణ ఆవిర్భవించిన తరువాత ఎన్నికల ప్రణాళికలోనే టిఆర్‌ఎస్ రాష్ట్రంలోని ప్రతి నియోజక వర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందించేట్టుగా ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తున్నట్టు ప్రకటించింది. ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణలను సస్య శ్యామలం చేసేందుకు ప్రధానంగా కాళేశ్వరం, పాలమూరు ఎత్తి పోతల పథకాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. గతంలోని ప్రాణహిత చేవెళ్ల పథకాన్ని రీ డిజైన్ చేసి కాళేశ్వరం పథకంగా మార్చారు. మహారాష్టత్రో ఒప్పందం కుదుర్చుకోవడం బాగానే ఉన్నా ఈ ప్రాజెక్టు ఎంత వరకు ప్రయోజన కరంగా ఉంటుంది, పూర్తి చేసే అవకాశం ఎంత వరకు ఉంటుంది అని విపక్షాలు అనుమానాలను లేవనెత్తారు. బడ్జెట్‌లో నీటిపారుదల ప్రాజెక్టులకు ఏటా 25వేల కోట్ల రూపాయలను కేటాయించనున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో కేటాయించింది కూడా. అయితే ఈ ప్రాజెక్టులన్నింటిని పూర్తి చేయాలంటే ఇప్పటి లెక్కల ప్రకారమే దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయల వ్యయం అవుతుంది, ఎలా పూర్తి చేస్తారు అనేది విపక్షాల ప్రశ్న. మూడు నాలుగేళ్లలో ఈ ప్రాజెక్టులన్నింటిని పూర్తి చేస్తామని ప్రభుత్వం చెబుతున్నా అదంత సులభంగా సాధ్యం అవుతుందా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఏటా 25వేల కోట్లు అయినా ఇంకా మూడేళ్ల గడువులో 75 వేల కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించగలుగుతారు. ఇక కేటాయించిన నిధుల్లో ఎంత వరకు వ్యయం చేయగలరు అనేది మరో ప్రశ్న. అయితే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా లభిస్తే, మిగిలిన ప్రాజెక్టులను ఈ నిధులతో పూర్తి చేయవచ్చునని అధికార వర్గాలు చెబుతున్నాయి. కాళేశ్వరంకు జాతీయ హోదాకు సంబంధించి పనులు సాగుతున్నాయి. కేంద్రంలో కదలిక వచ్చిన తరువాత రాజకీయంగా ఈ అంశం బిజెపికి ఉపయోగపడే విధంగా మార్చుకోవడానికి ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ మంత్రి ఉమాభారతిని కలిసి కాళేశ్వరంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని కోరారు.
గతంలో ప్రారంభించిన ప్రాజెక్టులనే రీ డిజైన్ చేశామని, కొత్తగా ప్రాజెక్టులేమీ చేపట్టలేదని ప్రభుత్వం చెబుతుండగా, విభజన చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ కొత్త ప్రాజెక్టులు చేపట్టిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేసింది. ఆంధ్రప్రదేశ్ అడ్డంకులు కల్పించినా ప్రాజెక్టులను నిర్మించి చూపిస్తామని ప్రభుత్వం చెబుతోంది. వైఎస్‌ఆర్ హయాంలో మాదిరిగా ఒకేసారి అన్ని ప్రాజెక్టులను చేపట్టి ఏదీ పూర్తి చేయలేదని, అలా కాకుండా స్వల్పకాలంలో, తక్కువ వ్యయంతో పూర్తయ్యే ప్రాజెక్టులపై ముందు దృష్టిసారించాలని వివిధ జిల్లాల నుంచి ప్రజాప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాల్లో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు రెండు మూడు నెలల్లో పూర్తవుతాయని జిల్లా నాయకులు తెలిపారు.