తెలంగాణ

దేశంలో మనమే టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 29: కేంద్ర ప్రభుత్వ గణాంకాలు, అంచనాలు పరిశీలిస్తే వృద్ధిరేటులో తెలంగాణ 21 శాతంతో దేశంలోనే మొదటిస్థానంలో నిలుస్తోందని సిఎం కె. చంద్రశేఖరరావు అన్నారు. హేమలంబ ఉగాది వేడుకలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి నివాస ప్రాంగణం ‘ప్రగతిభవన్’లో బుధవారం అట్టహాసంగా జరిగాయ. కార్యక్రమంలో కెసిఆర్ మాట్లాడుతూ పంచాంగ శ్రవణంలో చెప్పిన అంశాలు సైన్స్ కూడా చెప్పాయని గుర్తు చేశారు. 2017-18 సంవత్సరంలో పుష్కలంగా వర్షాలు కురుస్తాయని, రైతుల గాదెలు నిండేలా పంటలు పండుతాయని స్పష్టమవుతోందన్నారు. అంటే వ్యవసాయ రంగం అభివృద్ధిపథంలో ముందుకెళ్తోందని స్పష్టమవుతోందని, ఈ ప్రభావం మిగతా రంగాలపైనా ఉంటుందన్నారు. ఎల్‌నినో ప్రభావం ఖరీఫ్ సీజన్‌లో ఉండదని శాస్ర్తియంగా ఇప్పటికే ప్రకటించారని గుర్తుచేశారు. కొత్త ఏడాదిలో తెలంగాణలో నివసిస్తున్న ప్రజలు సుఖసంతోషాలతో జీవిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రం అన్నికోణాల్లో అభివృద్ధిపథంలో దూసుకుపోతుందన్న నమ్మకం ఉందన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్, ఆర్థిక ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు తదితరులతో తాను చర్చించానని, తెలంగాణ వృద్ధిరేటు 15 శాతం తగ్గకుండా ఉంటుందని, అందుకు అనుగుణంగా ప్రణాళికలను రూపొందించుకోవచ్చని స్పష్టం చేశారన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నవారు రెండున్నరేళ్లలో ఉత్పత్తులు సాధిస్తుండగా, తెలంగాణలో నాలుగైదునెలల్లో ఉత్పత్తులు ప్రారంభించే దశకు వస్తున్నాయని, పారిశ్రామికవేత్తలే ఈ విషయం స్పష్టం చేశారన్నారు. గత ఏడాది కొత్తగా 3500 పరిశ్రమలను 50 వేల కోట్లతో ఏర్పాటు చేశారని, తద్వారా రెండులక్షల మందికి ఉపాధి లభించిందన్నారు. ఉద్యమానికి ముందు తెలంగాణను వెనుకబడ్డప్రాంతంగా, కరవుపీడిత ప్రాంతంగా ఆనాటి పాలకులు, ఢిల్లీపెద్దలు భావించారని, ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత అన్ని రాష్ట్రాలను తలదనే్నలా అన్ని రంగాల్లో ముందుకు దూసుకువెళుతోందన్నారు. ఐఏఎస్, ఐపిఎస్ తదితర ప్రభుత్వ యంత్రాంగమంతా చక్కగా పనిచేస్తున్నారని, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నారన్నారు. తీవ్రవాదం, ఉగ్రవాదం కొంత ఇక్కట్లు కలగచేస్తుందని పంచాంగ శ్రవణం ద్వారా వెల్లడైందని, అందువల్ల హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మరింత సమర్థతగా పనిచేయాలని కెసిఆర్ సూచించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో రాష్ట్రం దూసుకువెళుతోందన్నారు. కెసిఆర్ ఆదాయం మిగులు బడ్జెట్‌గా ఉంటుందని చెబుతున్నారని, అంటే రాష్ట్ర బడ్జెట్ మిగులు దిశలో ఉంటుందని స్పష్టమవుతోందని శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. కెసిఆర్ గౌరవం జాతీయ స్థాయిలో కూడా మరింత పెరుగుతుందన్నారు. బంగారు తెలంగాణ దిశగా రాష్ట్రం అడుగులు వేస్తోందని శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి అన్నారు. గత ఏడాదికన్నా ఈ ఏడాది రాష్ట్రం మరింత ముందుకు వెళుతోందని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో రాష్ట్రప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ తదితరులు మాట్లాడారు.

చిత్రం... ప్రగతి భవన్‌లో హేమలంబ ఉగాది వేడుకలను జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు