తెలంగాణ

క్లీన్ సిటీగా వరంగల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, మార్చి 24: వరంగల్ జిల్లాకు భారీ టెక్స్‌టైల్ పార్క్ రాబోతోందని, అందుకు తగినట్లుగా వౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. గురువారం వరంగల్‌లో ఎంపి అజ్మీరా సీతారాంనాయక్ కుమారుడి వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వచ్చిన ముఖ్యమంత్రి... మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతారావు నివాసంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. భారీ టెక్స్‌టైల్‌పార్క్ ఏర్పాటువల్ల జనాభా ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని, అందుకు తగినట్లుగా సదుపాయాలు కల్పించాలన్నారు. వరంగల్ నగరానికి గతంలో ఎన్నడూ లేని విధంగా 300 కోట్ల బడ్జెట్ కేటాయింపులు జరిపినందున నగర ప్రజలకు సదుపాయాలు కల్పించేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించుకొని కార్యచరణ ప్రారంభించాలని సూచించారు. నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మార్చాలనగరంలోని ప్రధాన రహదారిని రద్దీకి అనుగుణంగా వెడల్పు చేయాలన్నారు. మార్కెట్‌లు, టాయిలెట్లు, కమ్యూనిటీ హాల్స్, పార్క్‌లు ఏర్పాటు చేయాలని చెప్పారు.