తెలంగాణ

యాదాద్రి, నిజామాబాద్‌లలో కేంద్రీయ విశ్వవిద్యాలయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 29: రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో రెండు కేంద్రీయ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ఇందుకు సంబంధించి ఈ వారం అధికారిక ప్రకటన వెలువడనుంది. ఈ రెండు యూనివర్శిటీల్లో ఒకటి యాదాద్రి జిల్లాలోనూ ఇంకోటి నిజామాబాద్‌లో ఏర్పాటు కానున్నాయి. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ ఇప్పటికే ఇందుకు సంబంధించిన ముసాయిదాను సిద్ధం చేసింది. గత రెండేళ్లుగా బిజెపి నేతలు పట్టు వదలని విక్రమార్కుల చందంగా కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ చుట్టూ చక్కర్లు కొట్టడంతో ఇందుకు సంబంధించి ఆమోదం లభించింది.
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్, శాసనసభాపక్ష నేత జి కిషన్‌రెడ్డి, నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ తదితరులు ఢిల్లీకి అనేక మార్లువెళ్లి కేంద్ర మంత్రికి విన్నపాలు చేయడంతో మానవ వనరుల మంత్రిత్వశాఖ రికార్డుల బూజు దులిపింది. కేంద్ర ప్రభుత్వ జలవనరుల సలహాదారుగా ఉన్న వెదిరె శ్రీరాం ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు పి వి శ్యాం సుందర్‌రావు, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు వేముల అశోక్‌లు వెళ్లి కోరడంతో అందుకు జవదేకర్ సానుకూలంగా స్పందించారు. కేంద్రం యూనివర్శిటీలను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉంది, రాష్ట్రప్రభుత్వమే అందుకు తగ్గ వౌలిక సదుపాయాలను కల్పించాల్సి ఉంటుంది, ప్రధానంగా స్థల సేకరణ చేసి కేంద్రానికి అప్పగిస్తే కేంద్రమే భవన నిర్మాణాలకు నిధులను మంజూరు చేస్తుందని జవదేకర్ పేర్కొన్నట్టు సమాచారం. ఛాలెంజ్ మోడ్ విధానాన్ని కేంద్రం తీసుకుంది. ఏ రాష్ట్రం ముందుగా వచ్చి స్థలాన్ని ఇస్తుందో ఆ రాష్ట్రానికే తొలుత నిధులు కేటాయించాలని కేంద్రం నిర్ణయించిన క్రమంలో ఆంధ్రాలో అపుడే విశాఖలో ఐఐఎంకు, తిరుపతిలో ఐఐటికి, తిరుపతిలోనే ఐఐఎస్‌ఇఆర్‌కు, కర్నూలులో ట్రిపుల్ ఐటికి, తాడేపల్లిగూడెంలో నిట్‌కు, విజయవాడలో ఆర్కిటెక్చర్ ప్లానింగ్ యూనివర్శిటీకి కేంద్రం నిధులను సమకూర్చింది. తెలంగాణ రాష్ట్రం ఆ దిశగా ముందు అడుగు వేయకపోవడంతో ఇంత వరకూ కేంద్రం నిధులను మంజూరు చేయలేకపోయింది. తెలంగాణ ప్రభుత్వం కేంద్రం కోరినట్టు కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు స్థలాన్ని కేటాయించాలని బిజెపి కోరింది.