తెలంగాణ

ఉద్యమబాటలో వర్శిటీ టీచర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 24: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ వర్శిటీల్లో కీలకమైన ఆరు సమస్యలపై ప్రభుత్వంతో అమీ తుమీ తేల్చుకోవాలని వర్శిటీ బోధన సిబ్బంది నిర్ణయించారు. సమస్యలను ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా పరిష్కారానికి నోచుకోవడం లేదని, మరో అవకాశం ఇచ్చి, భారీ ఉద్యమానికి సన్నద్ధం అవుతున్నామని తెలంగాణ స్టేట్ ఫెడరేషన్ ఆఫ్ యూనివర్శిటీ టీచర్సు అసోసియేషన్ చైర్మన్ ప్రొఫెసర్ బి సత్యనారాయణ గురువారం నాడు ప్రకటించారు. ప్రభుత్వంపై పోరునకు మార్చి 30న రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించనున్నట్టు ఆయన చెప్పారు. ఇందులో ప్రధానంగా వైస్ చాన్సలర్ల నియామకాలు, ఎగ్జిక్యూటివ్ కౌన్సిళ్ల నియామకాలు, రిటైర్మెంట్ వయోపరిమితిని పెంచడం, యూనివర్శిటీల్లో టీచర్ల నియామకం, బ్లాక్ గ్రాంట్‌లను పెంచడం, ఎంప్లాయిస్ హెల్త్ కార్డులుపై ఈ పోరు సాగుతుందని ఆయన వివరించారు. ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మాగాంధీ యూనివర్శిటీ, పాలమూరు, శాతవాహన, పొట్టిశ్రీరాములు, జెఎన్‌టియు, ఫైన్ ఆర్ట్సు వర్శిటీ, ఓపెన్ వర్శిటీల విసిల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, కొద్ది సంవత్సరాలుగా రొటేషన్‌లో ఐఎఎస్‌లు ఇన్‌ఛార్జిలుగా ఉన్నారని, ఇంత వరకూ విసిల నియామకం జరగకపోవడం వల్ల వర్శిటీల్లో పాలన కుంటుపడిందని పేర్కొన్నారు. చాలా వర్శిటీల్లో పిహెచ్.డి అడ్మిషన్లు జరగడం లేదని, ఎగ్జామినర్ల నియామకాలు జరగక అస్తవ్యస్థంగా వర్శిటీలు తయారయ్యాయని అన్నారు. చాలా వర్శిటీల్లో నేక్ అక్రిడిటేషన్ కమిటీల పర్యటనలు ఉన్నాయని, ఆ సమయంలో విసిల నియాకమం చాలా అవసరమని పేర్కొన్నారు. వీటికి తోడు వర్శిటీల్లో ఎగ్జిక్యూటివ్ కౌన్సిళ్ల నియామకాలు కూడా జరగలేదని వారు చెప్పారు. యుజిసి వర్శిటీల్లో బోధన సిబ్బంది రిటైర్మెంట్ వయస్సును 65 ఏళ్లకు పెంచారని, కాని ఏరాష్ట్రంలో మాత్రం ఆ పెంపుదల అమలుకావడం లేదని సత్యనారాయణ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రిటైర్ కావల్సి వస్తోందని చెప్పారు. యూనివర్శిటీల్లో 50 శాతానికి పైగా ఉద్యోగులు రిటైరయ్యారని, చాలా వరకూ నియామకాలు జరగలేదని పేర్కొన్నరు. సరిపడా బ్లాక్ గ్రాంట్‌లు లేక వర్శిటీలు ఆర్థిక ఇక్కట్లు ఎదుర్కొంటున్నాయని చివరికి సిబ్బంది జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొందని అన్నారు. యూనివర్శిటీల్లో పనిచేసే ఉద్యోగులు అందరికీ హెల్త్ కార్డులు జారీ చేయాలని కూడా డిమాండ్ చేశారు.