తెలంగాణ

ప్రాజెక్టులను మీ ఇష్టం వచ్చినట్టు మార్చేస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 30: మహబూబ్‌నగర్ జిల్లాకు ప్రాణప్రదమైన నాలుగు ప్రాజెక్టుల విషయంలో రాష్ట్రప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తోందని, ప్రాజెక్టులను ఇష్టం వచ్చినట్టు మారుస్తోందని బిజెపి సీనియర్ నేత నాగం జనార్ధన్‌రెడ్డి విమర్శించారు. మహాత్మాగాంధీ -కల్వకుర్తి ఎల్‌ఐఎస్, కోయిల్‌సాగర్ ఎల్‌ఐఎస్, రాజీవ్- బీమా , జవహర్ నెట్టెంపాడు ప్రాజెక్టులను పూర్తి చేయాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు.
మహాత్మాగాంధీ కల్వకుర్తి ప్రాజెక్టు వ్యయం 4896.24 కోట్లు కాగా అగ్రిమెంట్ వాల్యూ 3419.27 కోట్లు, అందులో మార్చి వరకూ వివిధ ప్రభుత్వాలు ఇంత వరకూ 2981.20 కోట్లు ఖర్చుచేశాయి. 2016-17 వ్యయంతో కలుపుకుంటే అది 3391.54 కోట్లు అవుతుంది. అలాగే కోయల్‌సాగర్ ప్రాజెక్టు అంచనా 581.93 కోట్లు కాగా, ఖర్చు చేసింది 465.99 కోట్లు, రాజీవ్ బీమా పథకం అంచనా 2658.40 కోట్లు కాగా, ఖర్చు చేసింది 2289.53 కోట్లు, జవహర్ నెట్టెంపాడు పథకం అంచనా 2331.47 కోట్లు కాగా, వ్యయం చేసింది 2029.18 కోట్లు మాత్రమే, అంటే ఇంత వరకూ నాలుగు ప్రాజెక్టుల అంచనా వ్యయం 10,468.04 కోట్లు కాగా వెచ్చించింది 8176.34 కోట్లు ఈ ప్రాజెక్టులకు కనీసం మరో వెయ్యి కోట్లు మంజూరు చేస్తే ప్రయోజనం ఉంటుందని నాగం జనార్ధనరెడ్డి అన్నారు.