తెలంగాణ

ఐఓసితో ఆర్టీసి ఒప్పందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 30: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వివిధ మార్గాల నుంచి ఆదాయాన్ని పెంచుకోవడంలో భాగంగా, సంస్థ పరిధిలోని ఖాళీగా ఉన్న స్థలాలను వాణిజ్య అవసరాల కోసం లీజు ప్రాతిపదికన ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా సంస్థ పరిధిలోని 28 ఖాళీ స్థలాలను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థకు 20 ఏళ్ల పాటు పెట్రోల్ బంకుల నిర్వహణకు నెలవారి అద్దె ప్రాతిపదికన ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సంస్థకు సంవత్సరానికి దాదాపు రూ. 1.40 కోట్లు అదనపు ఆదాయాం సమకూరనుంది. అంతేకాకుండా ఈ పెట్రోల్ బంక్‌ల నిర్వహణతో సంస్థకు ప్రతి ఏటా ఆదాయం సమకూరనుంది. మొత్తంగా ఈ లీజు ఒప్పందంతో సంస్థకు సాలీనా దాదాపు రూ. 4 కోట్ల మేరకు అదనపు ఆదాయం సమకూరనున్నట్టు అంచనా. ఇందుకు సంబంధించి గురువారం బస్‌భవన్‌లో టిఎస్‌ఆర్టీసి మేనేజింగ్ డైరెక్టర్ జివి రమణరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (రెవెన్యూ) సంస్థ కార్యదర్శి డి వేణు ఐఓసిఎల్ టాప్‌సో జిఎం డివి రమణరావు, సిడిఆర్‌ఎం, ఎస్‌డిఓ దీపక్ దాస్‌లు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో టిఎస్‌ఆర్టీసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, సత్యనారాయణ, నాగరాజు, రవీందర్ తదితరులున్నారు.