తెలంగాణ

నిరుద్యోగ యువతకు ఐఐఎస్‌సిలో నైపుణ్య శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 30: నిరుద్యో గ యువతకు నైపుణ్య శిక్షణ ఇచేందుకు బెంగళూరు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌స్ (ఐఐఎస్‌సి)తో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బిడిఎల్) అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం కోటి రూపాయల విరాళాన్ని కూడా బిడిఎల్ అందజేయనుంది. సోలార్ పివి, సిఎస్‌పి ఆధారిత ట్రైనింగ్, స్మార్ట్ మైక్రోగ్రిడ్‌ట్రైనింగ్‌ను యువతకు ఐఐఎస్‌సి అందించనుంది. ఈ నెల 27న హైదరాబాద్ బిడిఎల్‌లో ఎంఓయు కుదుర్చుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.