తెలంగాణ

దేవతల గుట్ట భూములపై విచారణకు కమిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 30: హైదరాబాద్‌లోని బాలాపూర్ వద్ద దేవతల గుట్ట ప్రభుత్వ భూమిలో అక్రమంగా భవన నిర్మాణాలను చేపట్టారన్న అభియోగాలపై హైకోర్టు గురువారం సంచలనమైన నిర్ణయం ప్రకటించింది. ఈ భూములకు సంబంధించి వచ్చిన ఆరోపణలపై నిజానిజాలను కనుగొనేందుకు హైకోర్టు రిజిస్ట్రార్ ఆధ్వర్యంలో కమిటీని నియమిస్తూ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ షమీమ్ అక్తర్‌తో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. బాలాపూర్‌కు సమీపంలోని దేవతల గుట్ట వద్ద ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయని, ఈ భూముల్లో ప్రైవేట్ సంస్థలు అక్రమంగా భవనాలు నిర్మిస్తున్నాయంటూ దేవతల గుట్ట పరిరక్షణ సమితి ఉపాధ్యక్షుడు ఎన్ రాంరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. హైకోర్టు రిజిస్ట్రార్ ఆధ్వర్యంలోని కమిటీలో హెచ్‌ఎండిఏ అధికారులు, స్థానిక ఎమ్మార్వోను సభ్యులుగా నియమించారు. ఏప్రిల్ 1న ఈ కమిటీ దేవతలగుట్టను సందర్శించి వాస్తవాలు తెలుసుకుని, భవనాల అక్రమ నిర్మాణం వివరాలను సేకరించాలని ఆదేశించింది. ఈ భూముల్లో నిర్మాణమైన భవనాలకు సంబంధించి ఫొటోగ్రాఫ్‌లను కూడా జతపరిచి నివేదికను ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కమిటీకి అవసరమైన భద్రత కల్పించాలని రాచకొండ పోలీసు కమిషనర్‌ను ఆదేశించారు. గతంలో ఈప్రాంతాన్ని సందర్శించిన అధికారులపై ప్రైవేట్ వ్యక్తులు భౌతిక దాడులకు దిగుతున్నారని జాయింట్ కలెక్టర్ ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకుని భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కమిటీకి అవసరమైన సహకారం అందించాలని అనుమతి లేని నిర్మాణాలు చేపడుతున్నట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న ప్రైడ్ ఇండియా బిల్డర్స్ ఇండియా సంస్థను హైకోర్టు ఆదేశించింది. ఏప్రిల్ 1వ తేదీన సందర్శించే కమిటీకి అవాంతరాలు కల్పిస్తే తీవ్రమైన కఠిన చర్యలు తీసుకుంటామని హైకోర్టు హెచ్చరించింది. ప్రైడ్ ఇండియా సంస్థ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ తమ పిటిషనర్ ఎటువంటి అక్రమ నిర్మాణాలకు పాల్పడలేదని కోర్టుకు తెలిపారు. అనంతరం ఈ కేసు విచారణను ఏప్రిల్ 6వ తేదీకి వాయిదా వేశారు.