తెలంగాణ

ఐపిఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ కార్యదర్శిగా అంజనీకుమార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 30: తెలంగాణ ఐపిఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఏడాది పాటు కొనసాగనున్న నూతన కార్యవర్గంలో అదనపు డిజిపి (లాఅండ్‌ఆర్డర్) అంజనీకుమార్ కార్యదర్శిగా, అదనపు సిపి (అడ్మిన్) టి మురళీకృష్ణ కోశాధికారిగా ఎన్నికయ్యారు. డిఐజి, సిఐ సెల్ ఇంటెలిజెన్స్ రాజేష్‌కుమార్ జాయింట్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. ఐజిపి అండ్ ఎండి టిఎస్ పిహెచ్‌సి బి మల్లారెడ్డి, డిఐజి ఇంటెలిజెన్స్ టి ప్రభాకర్‌రావు, సిపి నార్త్‌జోన్ బి సుమతి కార్యవర్గ సభ్యులుగా ఎన్నిక కాగా, ఎస్‌పి గ్రూప్ కమాండర్, గ్రేహౌండ్స్ ఎం రమేశ్ కో-ఆప్టెడ్ సభ్యుడిగా నియమితులయ్యారు.

చిత్రం..తెలంగాణ డిజిపి అనురాగ్‌శర్మను కలుసుకున్న నూతన కార్యవర్గం