తెలంగాణ

జూనియర్ కళాశాలల్లో గుట్టుగా అడ్మిషన్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 31: డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లను ఆన్‌లైన్ పద్ధతిలో చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది నుండి జూనియర్ కాలేజీల్లో సైతం ఆన్‌లైన్ అడ్మిషన్లు చేపడతామని గత వారం ప్రకటించడంతో విద్యార్ధులు, తల్లిదండ్రులు అయోమయంలో పడ్డారు. మరో పక్క రాష్ట్రంలోని కార్పొరేట్ జూనియర్ కాలేజీలు పెద్ద ఎత్తున అడ్మిషన్లు చేపడుతున్నాయి. ఇంటర్మీడియట్ బోర్డు ప్రతి ఏటా జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లకు ఒక షెడ్యూలును విడుదల చేస్తుంది, ఆ షెడ్యూలు ప్రకారమే అడ్మిషన్లు చేపట్టాలనే నిబంధనలను తుంగలో తొక్కి ప్రైవేటు,కార్పొరేట్ విద్యాసంస్థలు బహిరంగంగానే అడ్మిషన్లు చేపడుతున్నా వాటిని నియంత్రించాల్సిన ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డు అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. మరో పక్క మెరిట్ స్కాలర్‌షిప్ పేరుతో జూనియర్ కాలేజీలు రిజిస్ట్రేషన్ ఫీజు రూపంలో కోట్లాది రూపాయిలు దండుకుంటున్నాయి. ఎలాంటి ప్రవేశపరీక్ష లేకుండా చేపట్టాల్సిన అడ్మిషన్లకు అడ్డగోలుగా ప్రైవేటు కాలేజీలు ప్రవేశపరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఫీజు తగ్గిస్తామనే సాకుతో ఈ పరీక్షలు పెట్టడంతో తల్లిదండ్రులు నిర్బంధంగా వాటిని రాయించాల్సి వస్తోంది. కొన్ని కాలేజీలు రిజిస్ట్రేషన్ ఫీజును కూడా నిర్ణయించాయి. వంద రూపాయిలు చెల్లించాలని ఇళ్ల వద్దకు వచ్చి డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం హాల్‌టిక్కెట్లను ఇంటర్‌నెట్‌లో ఉంచినపుడు తయారుచేసిన నామినల్ రోల్స్ జాబితాను డౌన్‌లోడ్ చేసుకుని చాలా జూనియర్ కాలేజీలు కాల్‌సెంటర్ల ద్వారా అభ్యర్ధులను ఆకర్షిస్తున్నాయి. కొన్ని కాలేజీల ప్రతినిధులు నేరుగా ఇళ్లకు వెళ్లి విద్యార్ధుకు తామే నేరుగా మెరిట్ స్కాలర్‌షిప్ హాల్‌టిక్కెట్లను జారీ చేస్తున్నాయి. నానో స్పెషల్ కోచింగ్ సెంటర్ ప్రతినిధులు ఇళ్లకు వెళ్లి రిజిస్ట్రేషన్ పేరిట వంద రూపాయిలు ఇవ్వమని డిమాండ్ చేస్తున్నారు. అంతే గాక నిబంధనలను ఉల్లంఘించి కూడా ధైర్యంగా కాలేజీ ప్రతినిధులు రసీదులు ఇస్తున్నారు. ప్రవేశపరీక్షకు ఫీజు ఏమిటని ప్రశ్నిస్తే కాల్ సెంటర్‌లో ప్రతినిధులు ముందుగానే మీకు ఫోన్‌లో చెప్పారు కదా...మీరు డబ్బులు ఇవ్వాల్సిందే అంటూ బెదిరిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు మాత్రం వౌనం వహించడానికి కారణాలు అందరికీ తెలిసినవేనని అంటున్నారు. మరికొన్ని కాలేజీలు ఇప్పటికే ఫీజులను కూడా వసూలుచేశాయి. ఇంకొన్ని కాలేజీలు హాస్టల్ ఫీజులను వసూలు చేశాయి. ప్రతి ఆదివారం ప్రతి కాలేజీలో ప్రవేశపరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఇదంతా గత డిసెంబర్ నుండే ప్రారంభం కాగా, ఫిబ్రవరి నుండి ఊపందుకున్నాయి. అంతా జరిగిన తర్వాత ప్రభుత్వ ప్రాప్తకాలజ్ఞతపై విద్యార్ధులు, తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ప్రభుత్వం ఇంత వరకూ జూనియర్ కాలేజీల్లో ఫీజులను ఖరారు చేయలేదని, ఆన్‌లైన్‌కు సంబంధించి ఎలాంటి సంస్థాగత సదుపాయాలు కల్పించుకోలేదని, చివరి నిమిషంలో తమ నిర్ణయం మార్చుకుని వచ్చే ఏడాది నుండి ఆన్‌లైన్‌లో అడ్మిషన్లు చేస్తామని వాయిదా వేసుకుంటూ విద్యార్ధుల భవితవ్యం ఏం కావాలని తల్లిదండ్రులు నిలదీస్తున్నారు.