తెలంగాణ

యాసంగిలో 19 లక్షల ఎకరాలకు నీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 31: గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో ఈ యాసంగిలో దాదాపు 19 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించినట్టు నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. మిషన్ కాకతీయలో తీసిన పూడిక మట్టి వల్ల ఐదేళ్లలో రాని పంటల దిగుబడి గత ఖరీఫ్‌లో అధికంగా వచ్చిందని హరీశ్‌రావు తెలిపారు. యాసంగి లోనూ అద్భుతమైన ఫలితాలు రానున్నాయని చెప్పారు. మిషన్ కాకతీయ 3 కింద మంజూరైన చెరువుల మట్టిని సాయిల్ టెస్ట్ చేయించాలని సూచించారు. మిషన్ కాకతీయ 1,2 లానే మిషన్ కాకతీయ 3 కూడా స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రజలను భాగస్వాములను చేసి ఘనంగా ఉత్సవాలు జరిపి పనుల గ్రౌండింగ్ చేయాలని జిల్లా కలెక్టర్‌లను మంత్రి ఆదేశించారు. సచివాలయం నుంచి శుక్రవారం జిల్లా కలెక్టర్లు, ఇరిగేషన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
కొమురం భీమ్ ప్రాజెక్టును ఈ ఏడాది పూర్తి చేసి పూర్తి ఆయకట్టు 45వేల ఎకరాలకు సాగరు నీరు అందించనున్నట్టు మంత్రి తెలిపారు. వివిధ ప్రాజెక్టుల నిర్మాణంలో ఉన్న బాటిల్ నెక్ సమస్యలు గుర్తించి వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. ఎస్‌ఆర్‌ఎస్‌పి స్టేజి 2ను ఈ సంవత్సరం ఖరీఫ్ నాటి కల్లా పూర్తి చేయాలని నిర్ణయించారు. దీంతో సూర్యాపేట ఇల్లాలో ఒక లక్ష 80వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని మంత్రి చెప్పారు. ఈ పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని జిల్లా కలెక్టర్‌ను మంత్రి ఆదేశించారు. నాగార్జున సాగర్, నిజాంసాగర్, సింగూర్, ఎస్‌ఆర్‌ఎస్‌పి తదితర ప్రాజెక్టులు, ఇతర మీడియం ప్రాజెక్టుల గ్యాప్ ఆయకట్టు పూడ్చవలసి ఉందని అన్నారు. భారీ, మధ్య తరహా ప్రాజెక్టులు, చిన్న తరహా సాగునీటి వనరుల కింద వాస్తవ ఆయకట్టు నిర్థారించాలని ఆదేశించారు. గ్యాప్ ఆయకట్టును పూడ్చడానికి కేంద్ర ప్రభుత్వం ‘బ్రిడ్జింగ్ ద ఆయకట్టు’ పథకం కింద నిధులిస్తున్నందున వివిధ భారీ, మధ్య తరహా ప్రాజెక్టులలో ఉన్న గ్యాప్ ఆయకట్టును పూర్తి చేయడానికి కేంఅదం ఇస్తున్న నిధులు ఉపయోగించుకోవాలని అన్నారు. ఏప్రిల్ 7న ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ జల వనరుల శాఖ ప్రత్యేకంగా ఒక సమావేశాన్ని నిర్వహింహిస్తుందని మంత్రి చెప్పారు. దీనికి సంబంధించి ప్రతిపాదనలు వెంటనే పంపాలని కలెక్టర్లను కోరారు. మిషన్ కాకతీయ-2 పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్‌లో స్పెషల్ సిఎస్ జోషి, ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్, సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకటరామిరెడ్డి, ఇఎన్‌సి మురళీధర్‌రావు తదితరులు పాల్గొన్నారు.