తెలంగాణ

పోలీస్ బెటాలియన్లకు కొత్త కమాండెంట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 1: తెలంగాణలో పోలీస్ బెటాలియన్లకు కొత్త కమాండెంట్లు నియమితులయ్యారు. హైదరాబాద్ యూ సుఫ్‌గూడ బెటాలియన్-1గా పనిచేస్తున్న జెఎస్ చౌహాన్ పదోన్నతిపై తెలంగాణ గ్రేహౌండ్స్ బెటాలియన్‌కు బదిలీ అయ్యారు. అదనపు సిఎంటి ఆక్టోపస్‌కు పనిచేస్తున్న సి సన్ని వరంగల్ జిల్లా మమ్నూర్ 4వ, బెటాలియన్‌గా పదోన్నతిపై బదిలీ అయ్యారు. అదేవిధంగా మమ్నూర్‌లో పనిచేస్తున్న అదనపు కమాండెంట్ ఎం శ్రీనివాస కుమార్‌ను 12వ, బెటాలియన్ నల్గొండకు బదిలీ చేశారు. రంగారెడ్డి జిల్లా కొండాపూర్‌లో 8వ, బెటాలియన్‌లో పనిచేస్తున్న ఎం సిద్దిఖీను ఆక్టోపస్ కమాండెంట్‌గా, వేణుగోపాల్‌ను జోగులాంబ జిల్లా పదో బెటాలియన్ కమాండెంట్‌గా నియమించారు. పోలీస్ అకాడమిలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఎఆర్ సునీల్ కుమార్‌ను టిఎస్‌పిఏలో కమాండెంట్‌గా బదిలీ చేశారు. గ్రేహౌండ్స్ అదనపు కమాండెంట్ బి రాంప్రకాష్‌ను 15వ బెటాలియన్ కమాండెంట్‌గా, 17వ బెటాలియన్ కమాండెంట్ ఎన్‌వి సాంబయ్యను నిజామామాద్ 7వ, బెటాలియన్‌కు బదిలీ చేశారు.
హైదరాబాద్ ఇంటెలిజెన్స్ అదనపు కమాండెంట్ జివిఎస్‌ఎన్ మూర్తిని ఇంటెలిజెన్స్ కమాండెంట్‌గా పూర్తి బాధ్యతలు ఇచ్చారు. డిచ్‌పల్లి 7వ బెటాలియన్ కమాండెంట్ హెచ్ సత్యనారాయణ రావును కొండాపూర్ 8వ, బెటాలియన్‌కు, నిజామాబాద్ ఏడవ బెటాలియన్ కమాండెంట్ వై శ్రీనివాసరావును హైదరాబాద్ యూసుఫ్‌గూడ ఒకటవ బెటాలియన్‌కు బదిలీ చేశారు. ఈమేరకు హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజీవ్ త్రివేది ఉత్తర్వులు జారీ చేశారు.