తెలంగాణ

భద్రతకు భరోసా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 1: బాలికలపై లైంగిక వేధింపుల నివారణ, మహిళలకు భద్రత కల్పించడంలో తెలంగాణ పోలీసులు తీసుకుంటున్న చర్యలను మెట్రోపాలిటన్ సెషన జడ్జి జస్టిస్ రాధారాణి ప్రశంసించారు. ఈవ్‌టీజింగ్‌కు పాల్పడే వారిని షీ టీమ్స్, మహిళలకు భరోస కేంద్రాలు పనితీరును ఆమె అభినందించారు. శనివారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో నగర పోలీస్‌శాఖ ఏర్పాటు చేసిన ‘ప్రీవెన్షన్ ఆఫ్ చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్’ వర్కుషాపును ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, భరోస కేంద్రం ద్వారా మహిళల భద్రత, బాలికలపై లైంగిక దాడుల నివారణ, కుటుంబ కలహాల నేపథ్యంలో కౌనె్సలింగ్ నిర్వహణ వంటి చర్యలు చేపడతున్న షీ టీమ్స్ అధికారిణి స్వాతిలక్రాను ఆమె అభినందించారు. ఈ వర్కుషాపులో నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి, డిసిపి అవినాష్ మహంతి, పోలీస్ అధికారులతోపాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సైకాలజిస్టులు, పునరావాస కేంద్రాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షీటీమ్స్ అధికారిణి స్వాతిలక్రా మాట్లాడుతూ గత మే నెల నుంచి ఈ సంవత్సరం ఫిబ్రవరి వరకు తొమ్మిది నెలల్లో హైదరాబాద్‌లో 152 చైల్డ్ సెక్యువల్ అబ్యుజ్డ్ కేసులు నమోదయ్యాయని, వీరిలో 24 కేసులు 10 ఏళ్ల బాలికలు, 11 నుంచి 15 సంవత్సరాల వయస్సు కలిగిన 44 మంది, ఆ పైవయస్సు కలిగిన 64 మంది ఫిర్యాదులు చేసిన వారిలో ఉన్నారన్నారు. బాలికలపై లైంగిక దాడుల కేసులను సవాలుగా తీసుకొని నిందితులకు తగిన శిక్ష పడేలా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆమె పోలీస్ అధికారులకు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లను కోరారు. జాతీయ బాలికల సంరక్షణ చట్టం 2012 కింద బాలికలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత అందరిదని నగర కమిషనర్ మహేందర్‌రెడ్డి అన్నారు. బాలికలపై లైంగిక దాడులు, మహిళలపై వేధింపులు చాలా వరకు తగ్గాయని, పోలీస్ యంత్రాంగం ఆధునిక టెక్నాలజీని వినియోగించి నేరాలను హైదరాబాద్‌లో నేరాలను అదుపు చేయడంలో సఫలీకృతమవుతోందని పలువురు వక్తలు కొనియాడారు. ఈ సందర్భంగా తరుణి అనే సంస్థ రూపొందించిన ‘బాలల రక్షణ-పోలీసులు’ పుస్తకాన్ని జస్టిస్ రాధారాణి ఆవిష్కరించారు.

చిత్రం..వర్కుషాపులో ప్రసంగిస్తున్న జస్టిస్ రాధారాణి