తెలంగాణ

ఉస్మానియా ఉత్సవాలపై ప్రభుత్వ పెత్తనం ఏమీ లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 1: ఉస్మానియా యూనివర్శిటీ శతాబ్ది ఉత్సవాల నిర్వహణలో ప్రభుత్వ పెత్తనం ఏమీ లేదని డాక్టర్ కె కేశవరావు పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్శిటీ నిర్వహణ కమిటీ సభ్యుడిగా ఉన్న కేశవరావు పాత్రికేయులతో మాట్లాడుతూ శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వం తోడ్పడుతోందని చెప్పారు. యూనివర్శిటీతో సంబంధం ఉన్న అన్ని వర్గాలను భాగస్వామ్యులను చేస్తామని చెప్పారు. రాష్ట్రప్రభుత్వం 200 కోట్ల రూపాయిలను ఉత్సవాలకు కేటాయించిందని, సంవత్సరం పొడవునా కార్యక్రమాలు ఉంటాయని, అవసరమైతే మరిన్ని నిధులను ప్రభుత్వం నుండి కేటాయించేలా కృషి చేస్తామని అన్నారు. 25 మంది విద్యార్ధులు, 18 మంది లెక్చరర్లతో ఉస్మానియా యూనివర్శిటీ మొదలైందని, ఉస్మానియాకు నేక్ గుర్తింపు కేవలం సాంకేతిక అంశాలు కారణంగా రాలేదని, నేక్ గుర్తింపు త్వరలోనే వస్తుందని ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీల నేతలు పూర్వ విద్యార్ధి సంఘాల నాయకులు కూడా స్వచ్ఛందంగా ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నారని అన్నారు. యూనివర్శిటీ విద్యార్ధి సంఘాలకు గుర్తింపు ఎన్నికలు జరగాలనేదే తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు. కేంద్రం నుండి కూడా ఉస్మానియా యూనివర్శిటీకి నిధులు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. గౌరవ డాక్టరేట్ల ప్రదానంపై ఒయు పాలక మండలి శతాబ్ది ఉత్సవాలు జరిగే సంవత్సరంలోపు ఎప్పుడైనా నిర్ణయం తీసుకోవచ్చని వివరించారు.