తెలంగాణ

పంటలను తగలబెడుతున్నా పట్టదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోదాడ, ఏప్రిల్ 1: అన్నదాతలు పుట్టెడు కష్టాల్లో వున్నా ప్రభుత్వం నుండి కనీస స్పందనలేదని, మిరప పంటలు వేసిన లక్షలాదిమంది రైతు లు గిట్టుబాటుగాక చేతికొచ్చిన పంట ను తెంపకుండా వదిలేస్తున్నా, పంటలను కాలపెడుతున్నా పట్టించుకొనేవాడు లేకపోవడంతో రైతులు రాష్ట్రం లో కన్నీళ్లు పెడుతున్నారని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లా కోదాడ కాంగ్రెస్ కార్యాలయంలో శనివారం సాయంత్రం ఆయన విలేఖరులతో మాట్లాడారు. అంతకుముందు ఆయన మేళ్లచెర్వు మండలంలో మిర్చి పంటలను పరిశీలించి వచ్చారు. మిర్చి పంటను ప్రభుత్వమే 12 వేల రూపాయల మద్దతు ధరను చెల్లించి కొనుగోలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మిర్చి క్వింటాలుకు మార్కెట్‌లో ప్రస్తుతం ఐదువేల రూపాయలు మాత్రమే ధర పలుకుతుండటంతో కూలీలకు కూడా చెల్లించే ఖర్చులు రావని భావిస్తున్న రైతులు పంటలను వదిలేస్తున్నారని ఆయన వివరించారు. తెలంగాణ ఏర్పడిన తరువాత వ్యవసాయం పండగ అవుతుందని, రైతులు బాగుపడతారని భావించామని, కానీ పాలకులు వ్యవసాయరంగం పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ రైతుల సమస్యలను పట్టించుకోకుండా రైతులకు ఎలాటి భరోసా ఇవ్వకుండా వ్యవహరిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. మొదటినుండి తెరాస ప్రభుత్వం రైతువ్యతిరేకిగా పనిచేస్తున్నదని ఆయన విమర్శించారు. తెరాస ప్రభుత్వ నిర్లక్ష్యం వలన నకిలీ విత్తనాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, రైతులకు కరవు, వైపరీత్యాల నిధులు నేటికి పంపిణీ జరగలేదని అన్నారు. ఇప్పటికే పుట్టెడు కష్టాల్లో వున్న రైతులపై పిడుగుపడ్డట్లు సబ్సిడీ విత్తనాల ధరలను ప్రభుత్వం పెద్ద ఎత్తున పెంచిందని విమర్శించారు. వరంగల్ జిల్లా ఎనుమాముల మార్కెట్‌లో రైతులు మిర్చి పంటను కాలపెట్టినా ప్రభుత్వం స్పందించలేదని, గిట్టుబాటుధరలు లేక రైతులు ఆత్మహత్య చేసుకొంటున్నా చీమకుట్టినట్లుకూడా లేదని ఆయన ధ్వజమెత్తారు. రైతుల సమస్యలు పరిష్కరించేంతవరకు కాంగ్రెస్ పోరాటాలు చేస్తుందని ఆయన ప్రకటించారు. రాష్ట్రంలో మిర్చి పంటను సేద్యం చేసే నియోజకవర్గ కేంద్రాల్లో రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల మూడవ తేదిన ఉదయం ధర్నాలు చేసి తహశీల్దార్‌కు వినతిపత్రం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీశ్రేణులకు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. సమావేశంలో డిసిసిబి డైరెక్టర్ జొన్నలగడ్డ హనుమయ్య, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు చింతకుంట్ల లక్ష్మినారాయణరెడ్డి, మండల పార్టీల అద్యక్షులు వంగవేటి రామారావు, దేవబత్తిని వెంకటనర్సయ్య, ఎయిర్‌ఫోర్స్ వెంకటరెడ్డి, నడిగూడెం సహకార సంఘం చైర్మన్ సురేష్‌ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..విలేఖరులతో మాట్లాడుతున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి