తెలంగాణ

కార్పోరేట్ విద్యా సంస్థల దోపిడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 1: విద్యా సంస్ధలు భారీగా వసూలు చేస్తున్న ఫీజులను నియంత్రించేందుకు సమగ్రమైన చట్టం తీసుకుని రావాలని తెలంగాణ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ ఎం. కోదండరామ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం జూబ్లీహిల్స్‌లోని రావి నారాయణ రెడ్డి స్మారక భవన్‌లో విద్యా సంస్ధలు-్ఫజుల వసూలు అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రొఫెసర్ కోదండరామ్ ప్రసంగిస్తూ ఫీజులు పెంచేందుకు ప్రభుత్వం అధ్యయనం చేయాలని భావిస్తే, అందుకు తమకు అభ్యంతరం లేదు కానీ అప్పటి వరకు ఫీజులు పెంచకుండా చూడాలని కోరారు. విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యా సంస్ధల బలోపేతానికి చర్యలు చేపట్టాలని, సమాన విద్యకు చర్యలు తీసుకోవాలని ఆయ న డిమాండ్ చేశారు. అన్ని జిల్లాల్లో ఫీజుల నియంత్రణ కోసం డిఇవో కార్యాలయాల ఎదుట ధర్నా చేయాలని ఆయన టి.జెఎసి నాయకులకు, కార్యకర్తలకు సూచించారు.
పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు ఆస్తులు విక్రయించుకుంటున్నారని ప్రొఫెసర్ కోదండరామ్ ఆవేదన వ్యక్తం చేశారు. కార్పోరేట్ విద్యా సంస్ధల్లో డే-స్కాలర్లకు 60 వేల రూపాయల వరకు, వసతి గృహాల్లో ఉండే విద్యార్థుల నుంచి లక్షా 50 వేల వరకు వసూలు చేస్తున్నారని ఆయన తెలిపారు. ప్రైవేటు రంగంలో ఉన్న చిన్న పాఠశాలల కంటే కార్పోరేట్ రంగంలో ఉన్న ఫీజులు అధికంగా ఉన్నాయని అన్నారు. కార్పోరేట్ విద్యా సంస్ధల వల్ల విద్య అంటేనే ర్యాంకు అనే విధంగా పరిస్థితి తయ్యారైందని అన్నారు. ఇరుగు, పొరుగు వారిని చూసి తమ పిల్లల్ని కూడా కార్పోరేట్ స్కూళ్ళలో చదివించాలన్న భావనతో అనేక మంది తల్లిదండ్రులు కష్టపడుతున్నారని ప్రొఫెసర్ కోదండరామ్ తెలిపారు. ఇంకా ఈ సమావేశంలో అడ్వకేట్ రచనారెడ్డి, పలు పేరేంట్స్ అసోసియేషన్ల నాయకులూ పాల్గొన్నారు.

చిత్రం..విద్యా సంస్ధలు-్ఫజుల వసూలు అంశంపై శనివారం హైదరాబాద్‌లో
జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న జెఎసి చైర్మన్ కోదండరామ్