తెలంగాణ

ఇంటర్ ప్రైవేట్ కాలేజీల గుర్తింపు పొడిగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 2: తెలంగాణ రాష్ట్రంలో 2017-18 సంవత్సరానికి జూనియర్ కాలేజీలు నడిపేందుకు వీలుగా అఫిలియేషన్ గడువు పెంచేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ప్రైవేట్ ఎయిడెడ్/అన్ ఎయిడెడ్, జూనియర్ కాలేజీలు (కంపోజిట్ కాలేజీలు) సహకార కాలేజీలకు అఫిలియేషన్‌ను పొడిగిస్తున్నామని బోర్డ్ ఆఫ్ ఇంటర్ ఎడ్యుకేషన్ కార్యదర్శి డాక్టర్ ఎ. అశోక్ తెలిపారు. ప్రస్తుతం నడుస్తున్న కాలేజీల్లో అదనపు తరగతులను ప్రారంభించేందుకు కూడా అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన నోటిఫికేషన్ జారీ చేశారు. ఏప్రిల్ 3 నుండి 15 వరకు దరఖాస్తులు చేసేందుకు అవకాశం ఇచ్చారు. వేయి రూపాయల అదనపు ఫీజుతో ఏప్రిల్ 22 వరకు, పదివేల రూపాయల అదనపు ఫీజుతో ఏప్రిల్ 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తులను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లోనే పంపించాల్సి ఉంటుందని వివరించారు. ఫీజుల వివరాలు నోటిఫికేషన్‌లో తెలిపారు. ఇలా ఉండగా ఒకేషనల్ జూనియర్ కాలేజీలు, సాంఘిక / గిరిజన, సంక్షేమ జూనియర్ కాలేజీలు, ప్రభు త్వ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు, మాడల్ స్కూల్ జూనియర్ కాలేజీలకు సంబంధించిన నోటిఫికేషన్ తర్వాత ప్రకటిస్తామని అశోక్ వెల్లడించారు.