తెలంగాణ

లారీల సమ్మె ఉద్ధృతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 2: సింగిల్ పర్మిట్ విధానాన్ని ప్రవేశపెట్టాలని, దీర్ఘకాలిక సమస్యలు సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ లారీ యజమానుల సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె నాలుగో రోజుతో ఉద్ధృతమైంది. అక్కడక్కడ నడుస్తున్న డిసిఎం, ట్రాలీలను లారీ యజమానుల సంఘం నాయకులు అడ్డుకున్నారు. ఆదివారం హైదరాబాద్ సమీప ప్రాంతాలలో డిసిఎంలు నడుస్తున్నాయని తెలుసుకున్న లారీ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు పలు వాహనాలను అడ్డుకుని నిలిపివేశారు. లారీ యజమానులు భారీ ర్యాలీ నిర్వహించారు. కాగా హైదరాబాద్‌లో చైతన్యపురి నుంచి వనస్థలిపురం వైపు వస్తున్న ఓ డిసిఎంను లారీ యజమానుల సంఘం నాయకులు అడ్డుకుని అద్దాలు పగులగొట్టారు. దీంతో డిసిఎం డ్రైవర్ బాలేష్ ఒంటిపై డీజిల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఆత్మహత్యకు యత్నించిన డ్రైవర్ బాలేష్‌ను వారించడంతో స్వల్ప గాయాలయ్యాయి. ప్రభుత్వం పెంచిన బీమా ప్రీమియాన్ని తగ్గించాలని, సింగిల్ పర్మిట్ విధానాన్ని ప్రవేశపెట్టాలని, టోల్‌గేట్ టాక్స్‌ను తగ్గించాలని లారీ యజమానులు డిమాండ్ చేశారు. ఇదిలావుండగా ఆదివారం ప్రభుత్వం చర్చలకు ఆహ్వానిస్తుందని భావించిన లారీ యజమానులు, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో సమ్మెను మరింత ఉద్ధృతం చేయాలని ప్రకటించారు. లారీల సమ్మెతో తెలంగాణ రాష్టవ్య్రాప్తంగా రెండు లక్షల లారీలు ఎక్కడిక్కడే నిలిచిపోయాయి. సమ్మెలో కూరగాయల లారీలకు మినహాయింపు ఇచ్చినప్పటికీ, పొరుగు రాష్ట్రాల్లో సమ్మె ఉద్ధృతంగా కొనసాగుతుండడంతో అక్కడి నుంచి లారీలు రావడం లేదు. ఇప్పటికే మహరాష్టల్రో పది వేలకు పైగా లారీలు నిలిచిపోయాయి. దీంతో ఆ రాష్ట్రం నుంచి సరఫరా అయ్యే క్యాబేజి, ఉల్లి, ఆలుగడ్డ రవాణా నిలిచిపోయింది. అదేవిధంగా సిమెంటు, స్టీలు, ఇసుక వంటి రవాణా పూర్తిగా నిలిచిపోయింది. ఆటోనగర్‌లో సమ్మె చేస్తున్న లారీ యజమానులకు ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ సంఘీభావం తెలిపారు. నాలుగు రోజులుగా సమ్మె కొనసాగుతున్నా..ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించకపోవడం విచారకరమన్నారు. సోమవారం నుంచి అత్యవసర సరుకులు తరలించే లారీలను సైతం నిలిపివేయాలని నిర్ణయించినట్టు తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎన్ భాస్కర్‌రెడ్డి, బి దుర్గప్రసాద్ తెలిపారు.

చిత్రాలు..లారీల సమ్మెతో రాష్టవ్య్రాప్తంగా ఎక్కడికక్కడే నిలిచిపోయన లారీలు..
* ఒంటిపై డీజిల్ పోసుకుని నిప్పంటించుకున్న డ్రైవర్ బాలేష్‌ను అడ్డుకున్న దృశ్యం