తెలంగాణ

అభయారణ్యంలో తాగునీటి పైపులైన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 2: వన్యప్రాణి అభయారణ్యం, పులుల సంరక్షణ కేంద్రాల పరిధిలో తెలంగాణ ప్రభుత్వం నిర్మించబోయే తాగునీటి పైపు లైన్ల నిర్మాణ ప్రతిపాదనలను క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు త్వరలో కేంద్ర అధికార బృందం రానుంది. పైపు లైన్ల నిర్మాణానికి రోడ్లు తవ్వడం, కొన్ని చోట్ల మళ్లింపు వంటివి అభయారణ్య పరిధిలో చేపట్టాలంటే తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం 23 పనులపై ప్రతిపాదనలను తొలుత తెలంగాణ రాష్ట్ర వన్యప్రాణి అభయారణ్య బోర్డుకు సమర్పించింది. వాటిని పరిశీలించిన బోర్డు ఆమోదముద్ర వేసింది. కవాల్, అమ్రాబాద్ పులుల సంరక్షణ కేంద్రం, ప్రాణహిత అభయారణ్యం, పోచారం, కినె్నరసాని, ఏటూరు నాగారం వన్యప్రాణి ప్రాంతాల్లో పైపు లైన్ల పనులు చేపట్టేందుకు గాను ఫిబ్రవరిలో రాష్ట్ర బోర్డుకు ప్రభుత్వం నివేదిక అందజేయగా క్లియర్ చేసింది. అయితే వీటిని జాతీయ వన్యప్రాణి బోర్డు కూడా ఆమోదించాల్సి ఉంటుంది. గత నెలలో న్యూఢిల్లీలో జరిగిన జాతీయ బోర్డు స్టాండింగ్ కమిటీ 41వ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర బోర్డు ఇచ్చిన క్లియరెన్సులను నిలిపివేసింది. ఈ అనుమతులపై క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇచ్చేందుకు జాతీయ బోర్డు నలుగురు అధికారులతో కూడిన కమిటీని నియమించింది. ఈ అధికారుల బృందం అభయారణ్య పరిధిలో నిర్మించడం వల్ల వచ్చే పర్యావరణ తదితర అంశాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేసి నివేదికను కేంద్ర పర్యావరణ, అటవీశాఖకు సమర్పించాలని బోర్డు ఆదేశించింది.