తెలంగాణ

విట్ ప్రవేశ పరీక్షకు 2.23 లక్షల దరఖాస్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 3: వెల్లూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యూనివర్శిటీ నిర్వహిస్తున్న విటీ-2017 ప్రవేశపరీక్షకు 2.23 లక్షలదరఖాస్తులు వచ్చాయి. గత ఏడాది ఈ ప్రవేశపరీక్షకు 2,12,238 మంది దరఖాస్తు చేసుకోగా, ఈసారి అదనంగా 10,843 మంది దరఖాస్తు చేసుకున్నారని వర్శిటీ వ్యవస్థాపకుడు డాక్టర్ జి విశ్వనాధన్ తెలిపారు. ఆంధ్రా నుండి 34,068 మంది, ఉత్తర ప్రదేశ్ నుండి 23,360 మంది, తెలంగాణ నుండి 19,847 మంది, మహారాష్ట్ర నుండి 19,684 మంది, రాజస్థాన్ నుండి 16,304, తమిళనాడు నుండి 16,173 మంది దరఖాస్తు చేశారు. హైదరాబాద్‌లో 16,856 మంది, ఢిల్లీలో 15,079 మంది, విజయవాడలో 13,209 మంది, కోటలో 8877 మంది, చెన్నైలో 7686 మంది, పాట్నాలో 7321 మంది, వేలూరులో 2789 పరీక్ష రాయనున్నారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఏప్రిల్ 5 నుండి 16 వ తేదీ వరకూ దేశంలోని 119 కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్టు ఆయన వివరించారు. ఈ పరీక్షను దుబాయ్, కువైట్, మస్కాట్‌లలో కూడా నిర్వహిస్తున్నామని చెప్పరు. మే 10 నుండి 13 వరకూ కౌనె్సలింగ్ నిర్వహిస్తామని, మంచి ర్యాంకులు సాధించిన వారికి ఫీజు రాయితీ కల్పిస్తున్నామని అన్నారు.