తెలంగాణ

హిందుత్వంకోసమే విహెచ్‌పి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని, ఏప్రిల్ 3: హిందూ చరిత్ర వేల సంవత్సరాలది... దీనిని ఎవరూ మరువద్దు... హిందుత్వాన్ని పరిరక్షించేందుకే విశ్వహిందూ పరిషత్ ఆవిర్భవించిందని విహెచ్‌పి అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రవీణ్‌భాయ్ తొగాడియా అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలో నిర్మించిన విశ్వ హిందూ పరిషత్ స్వర్ణ జయంతి మందిర్ భవనాన్ని ఆయన సోమవారం రాత్రి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటైన సభలో ఆయన ప్రసంగిస్తూ... ధరలు విపరీతంగా పెరిగిపోతుంటే ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని, అరగంటకో రైతు ఆత్మహత్యకు పాల్పడుతున్నాడని, లక్షలాది మంది ఆకలితో అలమటిస్తూ, ప్రాణాలు వదులుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. మన దేశంలో మైనార్టీలు వాళ్ల జనాలను పెంచేందుకు కృషి చేస్తుంటే ప్రభుత్వం వాళ్లకు రాయితీలు, సబ్సిడీలు ఇస్తుందని, దేశ వ్యాప్తంగా పన్నులు హిందువులు కడుతుంటే... లాభపడేది మాత్రం మైనార్టీలవుతున్నారని తొగాడియా ఆవేశంగా మాట్లాడారు. భరతమాత సేవలో అందరూ కలిసి రావాలని హిందువులకు పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ఉన్న పేద హిందువుల కోసం హిందూ హెల్త్ కేర్ పేరిట భారత దేశ వ్యాప్తంగా ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామని, ఆంధ్ర, తెలంగాణలో 52 వేల మంది విద్యార్థులకు విహెచ్‌పి ఉచిత విద్యను అందిస్తోందని ఆయన స్పష్టం చేశారు. సమావేశంలో విహెచ్‌పి అధ్యక్షుడు రాఘవరెడ్డి, రాష్ట్ర, జిల్లా నేతలు వేపూరి రాములు గౌడ్ తదితరులున్నారు.