తెలంగాణ

ఆదర్శవంతమైన పాలన అందిస్తున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాండూరు, ఏప్రిల్ 3: దేశంలోనే ఆదర్శవంతమైన పాలనను తమ ప్రభుత్వం అందిస్తోందని రాష్ట్ర ఐటి, మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పేర్కొన్నారు. సోమవారం రాత్రి స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన సభలో మంత్రి కెటిఆర్ ప్రసంగించారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఉమ్మడి రాష్ట్రంలో చేయలేని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కేవలం రెండున్నర సంవత్సరాల టిఆర్‌ఎస్ పాలనలో చేపట్టామని సగర్వంగా చెప్పుకొంటామని మంత్రి కెటిఆర్ ఉద్ఘాటించారు. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు మిషన్ కాకతీయ వంటి మహత్తర కార్యక్రమం చేపట్టినట్లు మంత్రి వివరించారు. పశ్చిమ రంగారెడ్డి జిల్లాలో పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లాలో దాదాపు 5లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నట్లు చెప్పారు. కాగా, వచ్చే 2019 ఎన్నికల నాటికి రాష్ట్రంలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ వర్గాలకు, బీడీ కార్మికులు, చేనేత కార్మికుల సంక్షేమానికి వేలకోట్ల రూపాయలు కేటాయించినట్లు మంత్రి వివరించారు. రాష్ట్రంలో లక్షల సంఖ్యలో ఉన్న కురుమ, గొల్ల యాదవ కులాల వారి కులవృత్తులు, గొర్రెలు, మేకల పెంపకం, కుటీర పరిశ్రమలకు, చేనేత మగ్గాల వారికి వేల కోట్ల రూపాయలు కేటాయించింది తమ ప్రభుత్వం అన్నారు.
మంత్రి పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కెసిఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వెల్లడించారు.