తెలంగాణ

కోయిల్‌సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు రైతుల ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 3: కోయిల్‌సాగర్ ప్రాజెక్టు ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేయాలంటూ రైతులు ఆందోళనకు దిగారు. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర, నారాయణపేట నియోజకవర్గంలోని కోయిల్‌సాగర్ ఆయకట్టు రైతులు తమ పంటలు ఎండిపోతున్నాయంటూ ఏకంగా హైదరాబాద్ - రాయిచూర్ వెళ్లే 147 జాతీయ రహదారిని దిగ్బంధించి గంటల తరబడి రోడ్డుపై రైతులు బైఠాయించారు. దాంతో వాహనాల రాకపోకలకు ఆంతరాయం ఏర్పడింది. కిలోమీటర్ల పొడవునా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రైతులు చేపట్టిన ఆందోళనకు కాంగ్రెస్ మద్దతు తెలపడంతో రైతుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. కాంగ్రెస్ దేవరకద్ర నియోజకవర్గ ఇన్‌చార్జి పవన్‌కుమార్‌రెడ్డితో పాటు వందలాది మంది కాంగ్రెస్ శ్రేణులు ఈ ధర్నాలో పాల్గొని రైతులకు బాసటగా నిలిచిరు. కోయిల్‌సాగర్ ఆయకట్టుకు ఈ సీజన్‌లో ప్రభుత్వం పంటల సాగుకు ఐదు తడులు సాగునీరు వదులుతామని చెప్పి తీరా మూడు తడులకే ప్రాజెక్టు నుండి కాల్వలకు నీటిని నిలిపివేయడంతో చేతికి వచ్చిన పంటలు కళ్లముందే ఎండిపోతున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ స్వయంగా ఐదు తడులకు నీటిని విడుదల చేస్తామని చెప్పి అధికారులు మూడు తడులకే నీటిని నిలిపివేయడం ఏమిటని రైతులు ప్రశ్నించారు. గంటల తరబడి రోడ్డుపై రైతులు ఆందోళనకు దిగడంతో పోలీసులు పలుమార్లు రైతులకు, కాంగ్రెస్ నాయకులకు నచ్చజెప్పినా సాగునీటిని విడుదల చేసిన తరువాతే ఆందోళనను విరమిస్తామని రైతులు భీష్మించుకుని రోడ్డుపైనే కూర్చున్నారు. రైతుల ఆందోళనతో దిగివచ్చిన అధికారులు చివరగా ఆర్డీఓతో చర్చించిన తరువాత దేవరకద్ర తహశీల్దార్ రైతుల దగ్గరకు వచ్చి మంగళవారం ఉదయం 10 గంటల వరకు ప్రాజెక్టు ద్వారా పంటలకు సాగునీటిని విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. దాంతో రైతులు తమ ఆందోళనను విరమించారు. కాగా, ధర్నాలో పాల్గొన్న కాంగ్రెస్ నేత పవన్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ కోయిల్‌సాగర్ రైతుల పంటలు ఇప్పటికే ఎండుముఖం పట్టాయని, వందలాది ఎకరాల పంటలు సైతం ఎండిపోయావని తెలిపారు. ప్రభుత్వం సాగునీటి విషయంలో మాటతప్పిందని ఐదు తడులకుగాను కేవలం మూడు తడులకు మాత్రమే నీటిని నిలిపివేయడం ఏమిటని ప్రశ్నించారు. రైతుల పక్షాన కాంగ్రెస్ అండగా ఉంటుందని రైతులంటే ముఖ్యమంత్రికి చిన్నచూపు అని, అందుకే కోయిల్‌సాగర్ రైతులు సాగు చేసిన పంటలు ఎండిపోవడానికి ప్రభుత్వమే కారణమని ఆరోపించారు.