తెలంగాణ

మోదీవైపు గ్రామీణుల చూపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనగిరి, ఏప్రిల్ 3: దక్షిణ భారతదేశంలోని గ్రామీణ ప్రజానీకం దేశ ప్రధాని నరేంద్రమోదీ వైపు చూస్తున్నారని, ఈ ప్రాంతంలో పార్టీ బలోపేతానికి కార్యాచరణ రూపొందించామని బిజెపి జాతీయ నాయకుడు నల్లు ఇంద్రసేనారెడ్డి తెలిపారు. సోమవా రం యాదాద్రి భువనగిరి జిల్లా బిజెపి కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్తర భారతంలో బిజెపి విజయోత్సవాల పరంపర అనంతరం దక్షిణ భారతదేశంలో పార్టీ ని బలోపేతం చేసేందుకు కార్యాచరణ ప్రారంభించినట్లు తెలిపారు. ఈనెల 8నుండి 14వరకు కేంద్ర మంత్రులతో సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. అం దులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాకు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ విచ్చేయనున్నారని అన్నారు. గ్రామీణ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసి మం డల స్థాయి సమస్యలపై ఉద్యమాలు చేపడతామని, రెండు నెలలకొకసారి జిల్లాస్థాయిలో, ఆరునెలలకొకసారి రాష్ట్ర స్థాయిలో ఆందోళనలు చేపట్టి రాష్ట్ర ప్రభు త్వం వైఫల్యాలను ఎండగడతామన్నారు. రాను న్న 2019 ఎన్నికల్లో బిజెపి అత్యధిక స్థానాలను గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
నానాటికీ దిగజారుతున్న టిఆర్‌ఎస్ ప్రతిష్ట...
తెలంగాణ రాష్ట్రంలో టిఆర్‌ఎస్ ప్రతిష్ట నానాటికీ దిగజారుతోందని, తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కేంద్రంపై ఆరోపణలు చేస్తున్నారని బిజెపి నేత నల్లు విమర్శించారు. కేంద్రం మంజూరు చేసిన నిధులను దారిమళ్లించి తిరిగి కేంద్రం నిధులకోసం వెంపర్లాడుతున్నారని అన్నారు. ఏరాష్టమ్రైనా కేంద్రం నుండి మంజూరైన నిధుల వినియోగంపై సమగ్ర నివేదిక సమర్పించాలన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని అణిచివేస్తున్నారని, ప్రజా ఆందోళనలకు బయపడి ధర్నా చౌక్‌ను ఎత్తివేయడం వారి భయాన్ని ప్రతిబింబిస్తోందన్నారు.