తెలంగాణ

భద్రాద్రికి పెళ్లికళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, ఏప్రిల్ 3: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల శ్రీసీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో అతి ప్రధానమైన కల్యాణ మహోత్సవానికి శ్రీరామదివ్యక్షేత్రం భద్రాచలం ముస్తాబైంది. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. బుధవారం స్వామి వారి కల్యాణం, గురువారం మహాపట్ట్భాషేకం జరుగనున్నాయి. కల్యాణానికి ప్రభుత్వం తరుపున ముఖ్యమంత్రి కెసిఆర్ దంపతులు ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు తీసుకురానున్నారు. మహాపట్ట్భాషేకానికి గవర్నర్ నరసింహన్ దంపతులు స్వయంగా పట్టువస్త్రాలను సమర్పించడానికి అన్నీ సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో తరలివచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని దేవస్థానం పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. 3లక్షల లడ్డూ ప్రసాదాలను సిద్ధం చేశారు. తలంబ్రాలను విరివిగా అందించేందుకు వీలుగా పట్టణంలో 20 ప్రాంతాల్లో కౌంటర్లు ఏర్పాటు చేశారు.
ఆర్టీసీ బస్సుల్లో కూడా ఈసారి తలంబ్రాలు అందించనున్నారు. నవమికి వచ్చే భక్తుల దాహార్తిని తీర్చేందుకు 20లక్షల గ్యాలన్ల గోదావరి జలాలను క్లోరినేషన్ చేసి నిత్యం సరఫరా చేయనున్నారు. వీటి తో పాటుగా చల్లని మజ్జిగ, వైద్య, ఆరోగ్యశాఖ ద్వారా ఓఆర్‌ఎస్ ద్రావణాన్ని కూడా పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు వెల్లడించారు. భక్తుల సౌకర్యార్ధం దేవస్థానం ఈ సారి ముందుగానే ఆన్‌లైన్‌లో టిక్కెట్లను పెట్టింది. బ్యాంకుల ద్వారా దేవస్థానం రూ.2వేలు, రూ.1000లు, రూ.500లు, రూ.250లు, రూ.100ల టిక్కెట్లను విక్రయిస్తోంది. ఆలయాన్ని విద్యుత్ రంగవల్లులతో సుందరంగా తీర్చిదిద్దారు. ఆర్టీసీ ద్వారా కొత్తగూడెం రైల్వే స్టేషన్ నుంచి ప్రత్యేక బస్సులను, జిల్లా వ్యాప్తంగా 350 ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు. 2.50లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఇందుకనుగుణంగానే ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు పేర్కొన్నారు. కాగా ముఖ్యమంత్రి, గవర్నర్ పర్యటనల నేపథ్యంలో భద్రాద్రిని పోలీసులు చక్రబంధం చేస్తున్నారు. తెలంగాణ-ఆంధ్రా, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో గ్రేహౌండ్స్ బలగాలు ఇప్పటికే జల్లెడ పడుతుండగా, ఐజీ నాగిరెడ్డి, డిఐజీ రవివర్మల పర్యవేక్షణలో ఎస్పీ అంబర్‌కిషోర్‌ఝా, ఏఎస్పీ సునీల్‌దత్‌ల ఆధ్వర్యంలో 2500 మంది పోలీసు సిబ్బంది భద్రత చేపడుతున్నారు. ముగ్గురు అడిషనల్ ఎస్పీలు, 18 మంది డిఎస్పీలు, 70 మంది సిఐ లు, 170 మంది ఎస్సైలు, 800 మంది కానిస్టేబుళ్లు, 200 మంది మహిళా కానిస్టేబుళ్లు, 350 మంది హోంగార్డులు, 250 మంది ఏఎస్సైలు, 10 రోప్‌పార్టీలు, 15 స్పెషల్ పార్టీలుతో పాటు కేంద్ర పారామిలటరీ బలగాలు సైతం శ్రీరామనవమి బందోబస్తులో పాల్గొంటున్నాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుం డా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కళ్యాణ తలంబ్రాలను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భద్రాద్రికి తీసుకొస్తున్నారు.

చిత్రం..కోటి తలంబ్రాలతో తరలివచ్చిన భక్తులు