తెలంగాణ

ఫిరాయిస్తే ఈసీ చర్య తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 4: ప్రజలతో చట్ట సభలకు ఎన్నికైన ప్రజా ప్రతినిధులు, ప్రజాభీష్టానికి భిన్నంగా మరో పార్టీలోకి ఫిరాయిస్తే ఆ సభ్యునిపై చర్య తీసుకునే అధికారం ఆయా చట్ట సభల స్పీకర్లకు అధికారం ఇవ్వకుండా, కేంద్ర ఎన్నికల సంఘానికి (సిఇసి) ఇవ్వాలని ‘లా’ కమిషన్ చాలా గట్టిగా వాదిస్తోంది. ఫిరాయింపులకు అడ్డుకట్ట వేసేందుకు, ఇప్పుడు ఉన్న లోపాలను సరి చేసేందుకు ‘లా’ కమిషన్ సమగ్రంగా అధ్యయనం చేసి 2015 మార్చిలోనే కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు నివేదిక సమర్పించింది. కానీ, ఆ నివేదికపై కేంద్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా అటకెక్కించింది. గెలుపొందిన పార్టీని వీడి మరో పార్టీలో చేరితే, ఆ వెంటనే సభ్యత్వం రద్దయ్యేలా చట్టం రావాల్సి ఉందని, ఆ దిశగా ఆలోచన చేస్తున్నామని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు చెప్పిన సంగతి తెలిసిందే.
పార్టీ ఫిరాయించాలనుకునే వారు తొలుత తమకు ఉన్న అన్ని పదవులకూ రాజీనామా చేయాలని కూడా ఆయన అన్నారు. ఎన్నికల సంస్కరణలకు తాము శ్రీకారం చుట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఒక పార్టీ నుంచి ఎన్నికై మరో పార్టీలో చేరే ప్రజా ప్రతినిధి వాదనను, సొంత పార్టీ వాదనను సిఇసి విన్న తర్వాత వారిపై అనర్హత వేటు వేయాలని సిఫార్సు చేయాలని పేర్కొంది. తుదినిర్ణయం చట్ట సభల స్పీకర్‌లకు ఉండేలా కమిషన్ సిఫార్సు చేసింది. ఫిరాయింపుదారులు ఎంపీలైతే రాష్టప్రతికి చర్య తీసుకునే అధికారం కల్పించాలని, ఎమ్మెల్యే అయితే ఆ అధికారం గవర్నర్‌కు ఉండేలా చట్టంలో మార్పు తేవాలని ‘లా’ కమిషన్ పేర్కొంది. ‘లా’ కమిషన్ సిఫార్సులను పరిగణలోకి తీసుకుని ఫిరాయింపులకు బ్రేకు వేసేందుకు చర్యలు తీసుకోవడంలో కేంద్రం విఫలమైంది. రెండు రోజుల క్రితం ఏపి సిఎం చంద్రబాబు కేబినెట్ విస్తరణలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలకు స్థానం కల్పించడంతో మరోసారి ఫిరాయింపుల అంశం ‘తెర’పైకి వచ్చింది.
లోగడ తెలంగాణలో ముఖ్యమంత్రి కెసిఆర్ టిడిపి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవడంతో వివాదస్పదమైన సంగతి తెలిసిందే. తమ పార్టీ ఎమ్మెల్యేను మంత్రివర్గంలోకి తీసుకుని కెసిఆర్ రాజకీయాల్లో విలువలకు తిలోదకాలు ఇచ్చారంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు కూడా వైకాపా ఎమ్మెల్యేలను మంత్రివర్గంలోకి తీసుకోవడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. అయినా చంద్రబాబు ఇవేమీ పట్టించుకోకుండా 2019 ఎన్నికల సమయానికి ప్రతిపక్షాలను పూర్తిగా బలహీనపరిచే పనిలో నిమగ్నమయ్యారు.