తెలంగాణ

జిల్లాల్లో 20 ఐసీయూలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 4: రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్రప్రభుత్వం 20 ఇంటెన్సివ్ కేర్ యూనిట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఒక్కో ఐసియూలో 10 బెడ్స్ ఉంటాయి. దీని కోసం రాష్ట్రప్రభుత్వం రూ.29.44 కోట్ల నిధులను కేటాయించింది. ఈ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో సీనియర్ డాక్టర్లను నియమించనున్నారు. కార్డియాలజీ, ఊపిరితిత్తులు, అనస్తీషియా, జనరల్ మెడిసిన్‌లో నిపుణులను భారీ వేతనాలతో నియమించే ప్రక్రియను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రారంభించింది. మహబూబ్‌నగర్, కరీంనగర్, సిద్ధిపేటలో ప్రారంభించిన ఇంటెన్సివ్ కేర్ యూనిట్లకు మంచి స్పందన వస్తోంది. 20 చోట్ల ఐసియూలను ఏర్పాటుచేసేందుకు తెలంగాణ వైద్య విధాన పరిషత్ టెండర్లను ఆహ్వానించింది. రంగారెడ్డి జిల్లా తాండూరు, హైదరాబాద్‌లో కింగ్ కోఠి, నల్లగొండ, సంగారెడ్డి, మంచిర్యాల, నిజామాబాద్, జనగాంలో ఐసియూల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతించింది. ఒక్కో ఐసియూ ఏర్పాటుకు రూ. 32లక్షలు, వైద్య పరికరాల కొనుగోలుకు రూ.1 కోటి ఖర్చవుతుందని అంచనా. అనస్తీషియా (మత్తు వైద్య నిపుణుడు)కు నెల జీతం లక్ష రూపాయలు, జనరల్‌మెడిసెన్, పల్మనాలజీ నిపుణులకు నెలకు రూ. 80వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి ఐసియూలో ఐదుగురు నిపుణులు, ఆరుగురు నర్సులు ఉంటారు. ప్రతి నర్సుకు నెలకు రూ.20 వేల వేతనం ఇస్తారు. ల్యాబ్ టెక్నీషియన్, రేడియాలజీ, వెంటిలేటర్ టెక్నీషియన్లకు నెలకు రూ.15వేల వేతనం ఇస్తారు. ఎనిమిది ఏఎన్ నర్సులను నియమిస్తారు. వీరికి నెలకు రూ.12 వేల వేతనం చెల్లిస్తారు. ముగ్గురు సెక్యూరిటీ గార్డులను నియమించనున్నారు. ఒక్కో గార్డుకు నెలకు రూ. 9 వేల వేతనం ఇస్తారు.