తెలంగాణ

దండిగా భూగర్భ జలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 4: గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి తెలంగాణలో భూగర్భ నీటి మట్టం పెరిగింది. గత ఏడాది మే నెలతో పోలిస్తే ఈ ఏడాది మార్చిలో 4.84మీటర్ల పెరుగుదల కనిపించింది. నిరుడు మార్చిలో 14.37మీటర్లు రాష్ట్ర సగటు నీటిమట్టం కాగా, ఈసారి మార్చిలో 10.90 మీటర్లుగా నమోదైందని, 3.41మీటర్ల పెరుగుదల ఉందని భూగర్భ జల శాఖ తెలిపింది. మార్చి నెల భూ గర్భ జల స్థితిగతులపై నివేదిక విడుదల చేసింది. మొత్తం 31 జిల్లాలకు గాను మే 2016 నుండి మార్చి 2017తో పోల్చిన 0.67 మీటర్లు (ఆసిఫాబాద్ జిల్లా) నుండి 13.86 మీటర్లు(సిద్దిపేట జిల్లా) పెరుగుదల నమోదైంది. ఫిబ్రవరి 2017 నుండి మార్చి 2017 వరకు 0.78 మీటర్ల మేర భూ గర్భ జల మట్టం తగ్గడం వల్ల, భూగర్భ జల వినియోగం జరుగుతున్నట్టు తేలినట్టు చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర సరాసరి నీటి మట్టం మే 2017లో 11.40 మీటర్లుగా ఉంటుందని అంచనా వేసినట్టు డైరెక్టర్ తెలిపారు.