తెలంగాణ

తెలంగాణ టెన్త్ పరీక్షలో ఆంధ్రా ప్రశ్నపత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 4: పదో తరగతి పరీక్షల్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రశ్నాపత్రానికి బదులు ఆంధ్రా ప్రశ్నాపత్రం ఇచ్చిన విజ్ఞాన జ్యోతి పబ్లిక్ స్కూల్ నిర్వాకంపై విద్యార్థులు, తల్లిదండ్రులు మండిపడుతున్నారు. పాఠశాల వద్ద మంగళవారం నాడు తల్లిదండ్రులు, విద్యార్థులు వచ్చి ధర్నా నిర్వహించారు. సిబిఎస్‌ఇ విద్యార్థికి ఈ నెల 13వ తేదీన తెలుగు పరీక్ష సందర్భంగా తెలంగాణ ప్రశ్నాపత్రం కోడ్ 086కు బదులు ఆంధ్రా ప్రశ్నాపత్రం 007ను ఇచ్చారు. రెండు ప్రశ్నాపత్రాల్లో 57 మార్కుల వరకూ సమాధానాలు రాయగలిగేవిగా ఉండటంతో విద్యార్థి అంతవరకూ రాసేసి వచ్చేశాడు. మిగిలిన 33మార్కుల ప్రశ్నలకు జవాబులు రాయలేకపోయాడు. వాస్తవానికి రాష్ట్ర బోర్డు ప్రశ్నాపత్రం తొలి పేపర్ 40 మార్కులకు, రెండో పేపర్ 40 మార్కులకు ఇస్తారు. పాఠశాలకు చెందిన 24 మంది విద్యార్థులకు ఇదే విధంగా పేపర్ మారిపోవడంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.