తెలంగాణ

కాంగ్రెస్ ద్వంద్వనీతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 4: ప్రాజెక్టులు నిర్మించాలని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకులు పాదయాత్ర చేస్తారు, ప్రాజెక్టులు నిలిపివేయాలని మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ నాయకులు కోర్టులకు వెళతారు కాంగ్రెస్ నాయకులది ద్వంద్వ నీతి అని టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు ధ్వజమెత్తారు. కర్నె ప్రభాకర్, చింతా ప్రభాకర్‌లు మంగళవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. భూ దందాలు, అరాచకాలు చేసిన కాంగ్రెస్ పార్టీలో ఉంటూ సంపత్ టిఆర్‌ఎస్ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు. కాంగ్రెస్‌ది జిల్లాకో రాజకీయం, నియోజక వర్గానికో రాజకీయం అని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడమే అజెండాగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని అన్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర నిర్ణయించేది కేంద్ర మనే విషయం కూడా తెలియకుండా మద్దతు ధరపై కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని అన్నారు. ఇబ్రహీంపట్నంలో నెలకొల్పిన సీడ్ బౌల్‌కు అన్ని వైపుల నుంచి ప్రశంసలు వచ్చాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నామ రూపాలు లేకుండా పోతోందని, దేశ వ్యాప్తంగా తన ప్రతిష్ట కోల్పోతోందని అన్నారు.