తెలంగాణ

సిసిఐ పునరుద్ధరణకు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 4: రాజకీయాల్లో నైతికత చాలా ముఖ్యమని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. తెలంగాణలో బిజెపికి అనుకూల వాతావరణం ఏర్పడిందని, ఇక్కత తమ ప్రయోగం విజయవంతం అవుతుందని అన్నారు. మంగళవారం నాడిక్కడ ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ దక్షిణాదిన కూడా పార్టీ బలోపేతానికి బిజెపి అధిష్టానం దృష్టిపెట్టిందని అన్నారు. టిఆర్‌ఎస్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఏ ఒక్క హామీనీ ఇంత వరకూ అమలుచేయలేదని దత్తాత్రేయ విమర్శించారు. బంగారు తెలంగాణ తెస్తామని టిఆర్‌ఎస్ ఎన్నికలపుడు హామీ ఇచ్చిందని అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా ఆ మేరకు చర్యలు తీసుకోలేదని అన్నారు. కొత్త ఉద్యోగాలు రావాలని ఆకాంక్షించిన దత్తాత్రేయ త్వరలో సింగరేణికి కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించారు. సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పునరుద్ధరణకు చర్చలు జరుపుతున్నామని, త్వరలోనే దానిని పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఉత్తర -దక్షిణ, తూర్పు-ఈశాన్య- మధ్య భారతంలో విజయం సాధించిందని, ప్రధాని నరేంద్రమోదీ పట్ల, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపట్ల దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ఆకర్షితులు అవుతున్నారని, తెలంగాణలో కూడా ప్రజలు ఆదరిస్తారనే నమ్మకం కలుగుతోందని అన్నారు.

చిత్రం..మంగళవారం హైదరాబాద్‌లోని బిజెపి కార్యాలయంలో పార్టీ నేతలతో కలిసి
విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న కేంద్రమంత్రి బండారు దతాత్రేయ