తెలంగాణ

త్వరలో మిరప చట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 4: రాష్ట్రంలో రబీలో పండిన వరిధాన్యం కొనుగోలును బుధవారం నుండి ప్రారంభిస్తున్నామని, త్వరలోనే మిరప చట్టం (మిర్చి యాక్ట్) తీసుకువస్తామని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. సచివాలయంలో మంగళవారం ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో నకిలీ మిరప విత్తనాలతో నష్టపోయిన రైతులకు సీజన్ ముగియక ముందే నష్టపరిహారం ఇప్పించామని మంత్రి తెలిపారు. చరిత్రలో ఈ విధంగా నష్టపరిహారం ఇప్పించడం ఇదే మొదటిసారన్నారు. 326ఎకరాల్లో నష్టపోయిన రైతులకు యూనివెజ్ కంపెనీ పరిహారం చెల్లించిందన్నారు. ఎకరాకు 15వేల రూపాయల పరిహారం ఇచ్చేందుకు మోన్‌శాంటో కంపెనీ అంగీకరించిందన్నారు.
ఖమ్మం జిల్లాలో 3906మంది రైతులకు 1.57కోట్ల రూపాయలు, వరంగల్ జిల్లాలో 354ఎకరాల్లో జరిగిన నష్టానికి 19 లక్షల పరిహారం ఇప్పించామన్నారు. ఈ ఏడాది వర్షాలు బాగా ఉండటంతో మిర్చిసాగు భారీగా పెరిగిందని, దిగుబడులు బాగానే వచ్చాయన్నారు. మిరపకు కనీస మద్దతు ధర లేకపోవడంతో కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్‌తో మాట్లాడానని, మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ద్వారా మిర్చికొనుగోలు చేయాలని కోరానని తెలిపారు.
రాష్ట్రంలోని ప్రతి ఐదువేల ఎకరాలకు ఒక ఎఇఓను నియమించామని, మినీభూసార పరీక్షా కేంద్రాన్ని వారి పరిధిలో ఉంచామన్నారు. వ్యవసాయ శాఖలో 114 ఎఓ పోస్టులు, 73 హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేశామని గుర్తు చేశారు. గత 30 సంవత్సరాల నుండి సీడ్ సర్ట్ఫికేషన్ ఏజెన్సీలో ఖాళీగా ఉన్న 35 పోస్టులను గత ఏడాదికాలంలో భర్తీ చేశామన్నారు.

ప్రజాస్వామ్యాన్ని
అపహాస్యం చేస్తున్న టిడిపి
కేంద్ర మాజీమంత్రి పురంధ్రీశ్వరి
మార్కాపురం టౌన్, ఏప్రిల్ 4: ప్రజాస్వామ్యాన్ని తెలుగుదేశం ప్రభుత్వం అపహాస్యం చేస్తోందని, పార్టీలో కష్టపడి పనిచేసిన వారిని కాదని పార్టీలు మారి వచ్చిన వారికి మంత్రి పదవులు ఇవ్వడం ఏ పార్టీకి కూడా మంచిది కాదని కేంద్ర మాజీమంత్రి దగ్గుపాటి పురంద్రీశ్వరి అన్నారు. బిజెపి కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యేందుకు వచ్చిన పురంద్రీశ్వరి విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడంపై ఆమె తీవ్రంగా స్పందించారు. తన తండ్రి ఎన్టీఆర్ హయాంలో టిడిపిలో ఇలాంటి తప్పుడు కార్యక్రమాలు జరిగేవి కావని, అప్పట్లో కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారి వస్తామంటే ముందుగా రాజీనామా చేసిన తర్వాతే పార్టీలో చేరాలని సూచించేవారని గుర్తుచేశారు. ప్రస్తుతం పార్టీ మారి వచ్చిన వారికి ఇలా మంత్రి పదవి ఇవ్వడాన్ని ఆమె తప్పుపట్టారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే అంశాల పట్ల మన వైఖరి ఏమిటని ప్రధానమంత్రి మోదీకి, పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్‌షాకు లేఖలు రాసినట్లు ఆమె తెలిపారు. కాగా ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక గ్రాంట్‌తోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆమె అన్నారు. అంతకుముందు ఆమె కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ప్రత్యేక గ్రాంట్‌కు చట్టబద్ధత కల్పించారన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు మోదీ పలు కేంద్ర సంస్థలను మంజూరు చేశారన్నారు.