తెలంగాణ

కరవు రాష్ట్రాలకు ‘కాకతీయ’ వరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 4: యావత్ దేశానికే మిషన్ కాకతీయ మోడల్‌గా నిలుస్తుందని, మిషన్ కాకతీయ వల్ల తెలంగాణతో దేశానికి అనుసంధానం అయిందని కేంద్ర జల సంఘం చీఫ్ ఇంజనీర్ సికెఎల్ దాస్ అభిప్రాయం వ్యక్తం చేశారు. కేంద్ర జల సంఘం ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాలకు చెందిన ఇంజనీర్ల బృందం రాష్ట్రంలో మిషన్ కాకతీయ పథకం అమలును అధ్యయనం చేశారు. అనంతరం నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావుతో మంగళవారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశం అనంతరం కేంద్ర జల సంఘం చీఫ్ ఇంజనీర్ సికెఎల్ దాస్ మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని దేశమంతటా అమలు చేసేందుకు అధ్యయనం చేయాలని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి తెలంగాణకు పంపించారని చెప్పారు. సాగునీటి వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసే లక్ష్యంతో సాగుతున్న మిషన్ కాకతీయ అద్భుతమని దాస్ అన్నారు. ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టే మిషన్ కాకతీయ పథకం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా తదితర రాష్ట్రాల్లోని కరవు పీడిత ప్రాంతాల్లో తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉందని అన్నారు. మిషన్ కాకతీయ వంటి పథకాలకు మీడియా తగిన ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. మిషన్ కాకతీయ పనుల అనుభవాలు, సమాజంపై వాటి ప్రభావాన్ని ఆధారం చేసుకొని విజన్ డాక్యుమెంట్ రూపొందిస్తామని భోపాల్ సిడబ్ల్యుసి ఇసిఇ ఎస్‌కె హల్దర్ తెలిపారు.
మిషన్ కాకతీయను ప్రారంభించడానికి ముందు ముఖ్యమంత్రి కెసిఆర్ నెలల తరబడి ఎన్నో రోజులు,వేలాది గంటల పాటు మేధోమథనం చేశారని చెప్పారు. గతంలో చెరువుల మరమ్మత్తు పనులు ఆ గ్రామం వారికి కూడా తెలిసేవి కాదని, ఇప్పుడు ప్రజల సమక్షంలో ఒక ఉత్సవంలా పనులు జరుగుతున్నాయని చెప్పారు. మైనర్ ఇరిగేషన్ పనుల్లో గతంలో రాజకీయ జోక్యం ఎక్కువగా ఉండేదని, దాన్ని సమూలంగా నిర్మూలించినట్టు చెప్పారు. ఒక్క రూపాయి ప్రజాధనం కూడా దుర్వినియోగం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు చెప్పారు. తెలంగాణ ఇరిగేషన్ శాఖలో పలు సంస్కరణలు తీసుకు వచ్చినట్టు నీటిపారుదల శాఖ మంత్రి తెలిపారు. ఎన్‌ఆర్‌ఐలు, పోలీసులు, జర్నలిస్టులు, అధికారులు, పరిశ్రమల వారు చెరువులను దత్తత తీసుకోవడంతో కార్యక్రమం విజయవంతం అయిందని అన్నారు. ఇరిగేషన్ ఇంజనీర్లు ఒక్కోసారి రోజుకు 18 గంటల పాటు శ్రమిస్తున్నారని హరీశ్‌రావు తెలిపారు.

చిత్రం..మంగళవారం సచివాలయంలో కేంద్ర జలసంఘం ఆధ్వర్యంలో మంత్రి షరీశ్‌రావుతో
సమావేశమైన మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిస్సా రాష్ట్రాల ఇంజనీర్ల బృందం