తెలంగాణ

సమూల ప్రక్షాళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 4: తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్) అధికారం చేపట్టిన తర్వాత ఇంతకాలం ప్రభుత్వంపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఇక నుంచి పార్టీపై పూర్తిస్థాయి దృష్టి కేంద్రీకరించబోతున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చాక మూడు సంవత్సరాలలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సంస్థాగతంగా పార్టీకి గట్టి పునాది ఉండాలని ఆయన భావిస్తున్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పార్టీని నిలపడానికి దాని బాధ్యతలను బలమైన నాయకుడికి అప్పగించాలని సిఎం భావిస్తున్నారు. మంత్రి పదవి నిర్వహిస్తూనే పార్టీ వ్యవహారాలను పూర్తి స్థాయిలో పర్యవేక్షించే బాధ్యతను మంత్రి కె తారకరామారావుకు అప్పగించడానికి రంగం సిద్ధం అయినట్టు సమాచారం. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో 14 ఏళ్ళపాటు శ్రమించిన పార్టీ శ్రేణులకు ప్రభుత్వంలో భాగస్వామ్యం, తగిన ప్రాధాన్యమివ్వటం కోసం నామినేటెడ్ పదవులు కట్టబెడుతున్నారు. టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారికంటే పార్టీని మొదటి నుంచి నమ్ముకొని ఉన్న వారికే నామినేటెడ్ పదవులలో ప్రాధాన్యత ఇస్తున్నారు. పార్టీ బలహీనంగా ఉన్న జిల్లాల్లో ఇతర పార్టీల నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడమే కాకుండా బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న నేతలకు మంత్రి పదవులు కట్టబెట్టిన ముఖ్యమంత్రి, నామినేటెడ్ పదవుల విషయంలో మాత్రం పార్టీ శ్రేణులకు పెద్దపీట వేసారు. ప్రభుత్వం చేసిన మంచి పనులను ఓట్ల రూపంలో మలుచుకోవడానికి పార్టీకి బలమైన పునాది ఉంటేనే సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి భావిస్తున్నారు.
దీంట్లో భాగంగా పార్టీ సభ్యత్వాల నమోదు కార్యక్రమం చురుకుగా కొనసాగుతుంది. రాష్టవ్య్రాప్తంగా 40 లక్షల మందిని సభ్యులుగా చేర్చుకోవాలని ముఖ్యమంత్రి లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటికే 37లక్షల మందిని సభ్యులుగా చేర్పించారు. ఈ నెల 6వ తేదీతో సభ్యత్వ నమోదు కార్యక్రమం ముగిసే వరకు ఇది 40 లక్షలకు చేరుకుంటుందని అంచన వేస్తున్నారు. సంస్థాగతంగా పార్టీ నిర్మాణం ఇంతవరకు జిల్లా యూనిట్‌గా ఉండగా, ఇక నుంచి నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకునేలా పార్టీ నియమావళిలో మార్పు చేస్తున్నారు. జిల్లా కమిటీల స్థానంలో ఇక నుంచి నియోజకవర్గాల కమిటీలు ఉండేలా నియమావళిని మార్చుతున్నారు. నియోజకవర్గాల కమిటీలకు ఎమ్మెల్యేలను అధ్యక్షులుగా నియమించనున్నారు. ఎమ్మెల్యేలు లేని చోట ఇంచార్జీలకు పార్టీ పగ్గాలు అప్పగించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఈ నెల 21న హైదరాబాద్‌లో జరుగబోయే పార్టీ ప్లీనరీలో మారనున్న నియమావళిని సర్వసభ్య సమావేశం ఆమోదించనుంది. పార్టీ ప్లీనరీకల్లా తెలంగాణ భవన్‌ను ముస్తాబు చేసే పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. పార్టీ ప్లీనరీలో ఏ ఏ తీర్మానాలు ఉండాలో ఇప్పటికే నేతలకు పార్టీ అధినేత కెసిఆర్ సూచనలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కూడా పార్టీ తిరిగి అధికారాన్ని చేపట్టే వ్యూహాన్ని ప్రతిబింబించేలా రాజకీయ, ఆర్థిక, సామాజిక తీర్మానాలు రూపుదిద్దుకుంటున్నాయి.