తెలంగాణ

మంత్రాల నెపంతో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబ్బాక, ఏప్రిల్ 7: మంత్రాల నెపంతో దాడికి గురైన దంపతులు గురువారం అర్దరాత్రి మృతి చెందారు. విద్యుత్ స్తంభానికి కట్టేసి తీవ్రంగా కొట్టి నిప్పంటించడంతో తీవ్రంగా గాయపడిన కడవేర్గు సుదర్శన్, రాజేశ్వరీలకు దుబ్బాకలో ప్రాథమిక పరీక్షలు చేసి హైద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయతే రాజేశ్వరి మార్గం మధ్యంలో మృతి చెందగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సుదర్శన్ మృతి చెందాడు. వీరిద్దరి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి శుక్రవారం సాయం త్రం దుబ్బాకకు తీసుకొచ్చారు. దంపతుల మృతదేహాలను వైకుంఠరథంపై ఉంచి అంతిమయాత్ర చేపట్టారు. అంత్యక్రియల్లో ఎమ్మె ల్యే రామలింగారెడ్డి, ఏసిపి నర్సింహారెడ్డి, ప్రజాప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు. మృతుల కుమారుడు శ్రీ్ధర్ తల్లిదండ్రులకు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యుల రోదనలు అందరినీ తీవ్రంగా కలిచివేశాయి. అభంశుభం తెలియని తమ తల్లిదండ్రులను అమానవీయంగా పొట్టన పెట్టుకున్నారని వారు భోరున విలపించారు.
పోలీసుల అదుపులో 15 మంది
ఇదిలావుంటే, ఈ ఘటన జరిగిన ప్రాంతాన్ని సందర్శించిన సిద్దిపేట సిపి శివకుమార్, ఎసిపి నర్సింహారెడ్డి స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. బాధితులపై దాడి జరిగిన ప్రదేశంతో పాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాలను వారు పరిశీలించారు. గ్రామంలో గురువారం రాత్రి ఏర్పాటు చేసిన పోలీస్ పికెటింగ్‌ను శుక్రవారం అంత్యక్రియలు జరిగే వరకు పికెటింగ్ కొనసాగించారు. ఏసిపి నర్సింహారెడ్డి, సిఐలు సైదులు, నిరంజన్, ఎస్‌ఐలు, సిబ్బందిని మోహరించారు. ఈ సంఘటన పై సిపి, ఎసిపి ప్రత్యేక దృష్టి సారించారు. మృతుని తమ్ముళ్లు శ్రీనివాస్, మల్లేశంతో పాటు 15 మందిని అదుపులోకి తీసుకున్నామని, ఇతర నిందితులను కూడా త్వరలోనే పట్టుకుంటామని న్నట్లు ఏసిపి తెలిపారు.