తెలంగాణ

హిందువుల సంఘటితానికే వీర హనుమాన్ విజయయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్, ఏప్రిల్ 8: దేశంలోని హిందువులను సంఘటితం చేసేందుకే వీరహనుమాన్ విజయయాత్రను నిర్వహిస్తున్నామని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు రాఘవరెడ్డి అన్నారు. శనివారం నిర్మల్‌లో విహెచ్‌పి, బజరంగ్‌దళ్, ఇతర హిందూ సంస్థల ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయయాత్రను అట్టహాసంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని పురాతన దేవరకోట శ్రీ లక్ష్మి వెంకటేశ్వర ఆలయం నుండి ప్రారంభమైన ఈ శోభాయాత్ర పట్టణంలోని పలు ప్రధాన వీధులగుండా సాగింది. ఈ శోభాయాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన రాఘవరెడ్డి, బజరంగ్‌దళ్ రాష్ట్ర అధ్యక్షుడు శివరాం వేలాదిగా హాజరైన యువతనుద్దేశించి ప్రసంగించారు. మన వైభవాన్ని, సాంస్కృతిక ధర్మాన్ని నిలబెట్టడానికే దేశవ్యాప్తంగా ఇలాంటి విజయయాత్రలను నిర్వహిస్తున్నామన్నారు. 72 లక్షల చదరపు కిలోమీటర్లు ఉన్న అఖండ భారతదేశం దుర్మార్గుల పాలన వల్ల బాగా తగ్గిపోయందన్నారు. తిరిగి 72 లక్షల కిలోమీటర్ల అఖండ భారతదేశాన్ని సాధించడమే ఇలాంటి ర్యాలీల ముఖ్య ఉద్దేశమన్నారు.
దేశంలోని ఈశాన్య రాష్ట్రాలుగా చెప్పుకుంటున్న అస్సాం, త్రిపుర, మణిపూర్, అరుణాచల్‌ప్రదేశ్‌తోపాటు పశ్చిమబెంగాల్ లాంటి ప్రాంతాలు బంగ్లాదేశ్‌కు సరిహద్దు ప్రాంతాలుగా ఉండడంతో హిందువులు ధైర్యంగా, సుఖసంతోషాలతో ఉండలేకపోతున్నారన్నారు. తెలంగాణలో వీర హనుమాన్ విజయయాత్ర ర్యాలీలను ఎంతో గొప్పగా జరుపుకుంటున్నామని కాని ఈశాన్య రాష్ట్రాల్లో ఇలాంటి ర్యాలీలను నిర్వహించుకోలేని దుస్థితిలో ఉన్నామన్నారు. దీనంతటికి కారణం హిందూ సమాజం మతం మారడమేనన్నారు. ఎక్కడైతే హిందూ సమాజం సంఘటితంగా లేదో అక్కడ దాడులు పెరిగిపోతున్నాయని వాపోయారు. జమ్మూకాశ్మీర్‌లోని అల్వా అనే ప్రాంతంలో 3 లక్షల మంది హిందువులను తరిమి తరిమికొట్టారని గుర్తుచేశారు.

చిత్రం..వీర హనుమాన్ విజయయాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రసంగిస్తున్న విహెచ్‌పి
అంతర్జాతీయ అధ్యక్షుడు రాఘవరెడ్డి