తెలంగాణ

అనుమతి లేదని గోశాల కూల్చివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ హయత్‌నగర్, ఏప్రిల్ 8: కబేళాలకు తరలిస్తున్న గోవులను రక్షించి సంరక్షిస్తున్న ఒక గోశాలను అనుమతి లేదనే కారణంతో రెవెన్యూ అధికారులు కూల్చివేసిన ఉదంతం హయత్‌నగర్ మండలం తుర్కయంజాల్ రెవెన్యూ పరిధిలో చోటు చేసుకొంది. సర్వేనెంబర్ 135, 136ల్లో 12 ఎకరాల పట్టా భూమిలో స్వచ్ఛంద సంస్థ మూడు ఎకరాలలో గోశాలకు షెడ్డు నిర్మించింది. ఈ నిర్మాణం ఎఫ్‌టిఎల్ పరిధిలో ఉందని పేర్కొంటూ రెవెన్యూ అధికారులు ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా శుక్రవారం జెసిబిలతో నేలమట్టం చేశారు. దీంతో సుమారు 650గోవులు గూడు కోల్పోయ ఎండకు అల్లాడిపోతున్నాయ. విషయం తెలుసుకున్న బజరంగ్‌దళ్, బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్, విహెచ్‌పి, గోప్రేమికులు సాగర్ జాతీయ రహదారిపై శనివారం పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. అడిగినంత లంచ ఇవ్వలేదని ఓ ముస్లిం, క్రిస్టియన్ అధికారులు గోశాలను కూల్చివేశారని వారు ఆరోపించారు. సుమారు 30లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని, దానికి ప్రభుత్వమే సొంత నిధులతో గోశాల షెడ్డును పునఃనిర్మించి అధికారులను సస్పెండ్ చేసి వారిపై క్రిమినల్ కేసులను నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. సోమవారం ఆర్‌డిఒ, తహసీల్దార్ కార్యాలయాల ముందు గోవులతో పెద్దఎత్తున ఆందోళన చేపడుతామని వారు హెచ్చరించారు. ఓ పక్క ప్రభుత్వ భూములు అప్పనంగా కబ్జాకు గురవుతున్నా పట్టించుకోని అధికారులు సేవా భావంతో గోశాల నిర్మించి వాటికి రక్షణ కల్పిస్తున్న గోశాలను నిబంధనల పేరుతో కూల్చివేయడం ఎంతవరకు సమంజసమని ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నించారు. గోశాల కూల్చివేతకు నిరసనగా పరివార్ నేతలు చేపట్టిన ధర్నాతో సాగర్ రహదారి పూర్తిగా స్తంభించి పోయింది. రోడ్డుకు ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రంగంలోకి దిగిన ఆదిభట్ల పోలీసులు సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.

చిత్రం..సాగర్ రహదారిపై ఆందోళన చేస్తున్న దృశ్యం